అనూప్ రూబెన్స్ @ 50
Send us your feedback to audioarticles@vaarta.com
జై చిత్రంతో సంగీత దర్శకుడిగా తొలి అడుగులు వేశారు అనూప్ రూబెన్స్. ఆ తరువాత కొన్ని చిత్రాలు చేసినా.. 2011లో వచ్చిన ప్రేమకావాలితో తొలి బ్రేక్‌ని అందుకున్నారు. ఇష్క్, మనం, టెంపర్, సోగ్గాడే చిన్ని నాయనా, నేనే రాజు నేనే మంత్రి తదితర చిత్రాలతో సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం అనూప్.. ఇష్క్, మనం చిత్రాలతో తనకి మంచి గుర్తింపు తీసుకువచ్చిన దర్శకుడు విక్రమ్ కె.కుమార్ రూపొందిస్తున్న హలో చిత్రానికి సంగీతమందిస్తున్నారు. అక్కినేని అఖిల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
రేపు ఈ సినిమా ఆడియో వేడుక వైజాగ్‌లో జరుగనుంది. విశేషమేమిటంటే.. ఈ సినిమాతో అనూప్ రూబెన్స్ 50 చిత్రాలు పూర్తిచేసుకుంటున్నారు. సంగీత దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన 13 ఏళ్ల తరువాత.. అనూప్ ఈ మైలురాయికి చేరుకున్నారన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments