అనూప్ కి ఈ సారీ వర్కవుట్ అయ్యేలా ఉంది
Send us your feedback to audioarticles@vaarta.com
దేవిశ్రీప్రసాద్, థమన్.. ఇలా గట్టి పోటీ ఉన్నప్పటికీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు యువ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. దేవిశ్రీ, థమన్లా పెద్ద హీరోల సినిమాలను వరుస పెట్టి చేయకపోయినా.. అప్పుడప్పుడు అలాంటి సినిమాలతోనూ సందడి చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. బాలకృష్ణ హీరోగా రూపొందిన తాజా చిత్రం పైసా వసూల్కీ అనూప్‌నే సంగీత దర్శకుడు. ఇటీవలే ఈ చిత్ర ఆడియో విడుదలైంది. పాటలకు మంచి స్పందనే లభిస్తోంది. ముఖ్యంగా టైటిల్ సాంగ్‌కి అనూప్ అందించిన సంగీతం అదిరిపోయింది.
ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. స్టార్ హీరోలకు అనూప్ సంగీతమందించిన తొలి చిత్రాలన్నీ హిట్టే అయ్యాయి. స్టార్ హీరోల చిత్రాలకు సంగీతమందించే అవకాశాన్ని తొలిగా నాగార్జునతో పొందిన అనూప్.. నాగ్ కాంబినేషన్లో మొదటి చిత్రమైన మనంతో హిట్ కొట్టాడు. ఆ తరువాత వెంకటేష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన గోపాల గోపాలతోనూ చెప్పుకోదగ్గ విజయం అందుకున్నాడు. ఈ ఇద్దరితోనూ అనూప్ కిదే తొలి చిత్రం కావడం గమనార్హం. ఇక ఎన్టీఆర్ కాంబినేషన్లో అనూప్ తొలిసారిగా పనిచేసిన టెంపర్ కూడా హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ కాంబినేషన్లో చేస్తున్న తొలి చిత్రమైన పైసా వసూల్ కూడా అదే బాటలో వెళ్లి.. అనూప్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments