Anukunnavanni Jaragavu Konni: 'అనుకున్నవన్నీ జరగవు కొన్ని' మూవీ రివ్యూ

  • IndiaGlitz, [Tuesday,November 14 2023]

తారాగణం: శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక, పోసాని కృష్ణ మురళి, బబ్లు మాయ్య, కిరీటి, స్నేహ మాధురి, సోనియా చౌదరి, గౌతమ్ రాజు, మిర్చి హేమంత్.
సంగీతం : గిడియన్ కట్ట.
ఎడిటర్ : కె సి బి హరి.
నిర్మాణం: శ్రీ భరత్ ఆర్ట్స్.
నిర్మాత & దర్శకుడు: జి సందీప్

కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమా చూసే విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన ఓటీటీ కారణంగా ప్రపంచం నలుమూలలా వున్న కంటెంట్‌ను చూసే అవకాశం కలిగింది. రోటీన్‌కు భిన్నంగా వుండే వెబ్ సిరీస్‌లు, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ , హార్రర్ జోనర్‌లు ప్రేక్షకులను అలరించాయి. ఈ కారణం చేత మూసధోరణి తీసిన సినిమాలను.. ఎంతటి స్టార్ వున్నా, ఎలాంటి క్యాస్టింగ్ నటించినా మొహమాటం లేకుండా తిప్పికొడుతున్నారు. ఓటీటీలల్లోనే అన్ని చూస్తున్న జనం.. కథలో వైవిధ్యం వుండే.. మౌత్ టాక్ బాగుంటే తప్పించి థియేటర్స్‌కి రావడం లేదు. అందుకే మేకర్స్ కొత్త కాన్సెప్ట్‌లను వెతికిపడుతున్నారు. అలా డిఫరెంట్‌గా తెరకెక్కిన చిత్రమే ‘‘అనుకున్నవన్నీ జరగవు కొన్ని’’. అందరూ కొత్త వాళ్లంతా తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా వుందో చూస్తే...

కథేంటి :

కార్తీక్ (శ్రీరామ్ నిమ్మల) కాల్ బాయ్‌గా, హీరోయిన్ మౌనిక (మధు)లు కాల్ గర్ల్‌గా పనిచేస్తూ వుంటారు. అసలు వాళ్లిద్దరూ ఎందుకు అలాంటి వృత్తిని ఎంచుకున్నారు.. వాళ్ల జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల వారిద్దరూ ఎలా ఇరుకునపడ్డారు, ఫ్లాట్‌లో హత్యకు గురైంది ఎవరు.. ఎవరు చేశారు , చివరికి హీరో హీరోయిన్లు కష్టాల నుంచి ఎలా బయటపడ్డారు అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ :

దర్శకుడు, నిర్మాత రెండూ పాత్రలను తనే పోషించి ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు జీ సందీప్. ఇదొక క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్. కాల్ బాయ్/ కాల్ గర్ల్స్‌గా మారినవారు ఏ పరిస్థితుల్లో ఇలాంటి జీవితాన్ని ఎంచుకుంటారు అనేది సందీప్ చెప్పే ప్రయత్నం చేశారు. హీరో హీరోయిన్లను డిఫరెంట్ క్యారెక్టర్‌లో చూపిస్తూ.. కథనాన్ని ఇంట్రెస్టింగ్‌గా కొనసాగించాడు డైరెక్టర్. ఆరంభంలో కథ స్లోగా వున్నప్పటికీ.. ఫ్లాట్‌లో హత్యలు తర్వాత పరుగులు పెడుతుంది. అసలు ఆ హత్యలు ఎవరు చేశారనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలిగిస్తూ మధ్యలో మలుపులు తిరుగుతూ సినిమా ముందుకు సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ .. ఆ తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను కలిగించింది.

సెకాండఫ్‌లో పోసాని కృష్ణ మురళి, బబ్లూ మాయల యాక్టింగ్ అదరిపోయింది. పోసాని కామెడీతో పాటు కాస్త సీరియస్ లుక్‌లో కనిపించి సినిమాకు బ్యాక్‌బోన్‌గా నిలిచారు. ఆయనలోని పూర్తి స్థాయి నటుడిని దర్శకుడు ఉపయోగించుకున్నాడు. హీరో శ్రీరామ్ నిమ్మల , హీరోయిన్ మౌనిక కలపాల ఇద్దరూ చాలా ఈజ్‌తో నటించారు. తెలుగు సినిమాలో హీరోహీరోయిన్లు ఇద్దరు కాల్‌బాయ్, కాల్ గర్ల్‌గా వేసింది లేదు. ఇలాంటి పాత్రలు చేయడానికి చాలా ధైర్యం కావాలి. కానీ వారిద్దరూ ఈ క్యారెక్టర్‌ను చాలా బాగా చేసుకెళ్లారు. కిరిటీ, స్నేహా మాధురి, సోనియా చౌదరి, గౌతం రాజు, మిర్చి హేమంత్‌‌లు తమ పాత్రలకు న్యాయం చేశారు. గిడియన్ కట్ట బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ఎడిటర్ కేసీబీ హారి సినిమాను చాలా అందంగా కట్ చేశారు. దర్శకుడు కమ్ నిర్మాతగా రెండు బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తించిన సందీప్ .. ఎక్కడా తగ్గకుండా సినిమాను చాలా గ్రాండ్‌గా తీశారు. క్రైమ్ అండ్ కామెడీని ఇష్టపడే వారికి ‘‘ అనుకున్నవన్నీ జరగవు కొన్ని’’ ఖచ్చితంగా విందు భోజనమే.

More News

KCR: వైఎస్ షర్మిల డబ్బు కట్టలు పంపుతున్నారు.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నర్సంపేట బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల కక్ష కట్టిందని తీవ్ర ఆరోపణలు చేశారు.

Tula Uma: బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన తుల ఉమ.. బీజేపీపై తీవ్ర విమర్శలు..

నాలుగు రోజులుగా కొనసాగుతున్న హైడ్రామాకు తెరపడింది. బీజేపీకి రాజీనామా చేసిన తుల ఉమ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆమె గులాబీ కండువా కప్పుకున్నారు.

Rahul Gandhi: గెలుపు కోసం కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్.. ఆరు రోజుల పాటు రాహుల్ గాంధీ ప్రచారం

తెలంగాణ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంటుంది. పోలింగ్‌కు మరో రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

Salman Khan: థియేటర్‌లో టపాసులు కాల్చడంపై సల్మాన్‌ ఖాన్ ఆందోళన

తమ హీరో సినిమా రిలీజ్ అయితే చాలు అభిమానులు చేసే సందడి అంత ఇంత కాదు. అభిమాన హీరోను వెండితెరపై చూస్తూ థియేటర్లలో

KTR: నాంపల్లి అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5లక్షల సాయం: కేటీఆర్

నాంపల్లి అగ్నిప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.5లక్షల పరిహారం ప్రకటిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.