ఫిబ్రవరిలో విడుదల కానున్న ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’

  • IndiaGlitz, [Saturday,February 01 2020]

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా ఫస్ట్ లుక్, ప్రచార చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
దర్శకుడు బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ ‘‘ఆల్రెడీ రిలీజైన ట్రైలర్, పోస్టర్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా ప్రేక్షకులు అందరికీ థాంక్స్. మొదట మా సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేయాలనుకున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కాస్త ఆలస్యం కావడం, ఇతర టెక్నికల్ సమస్యల వలన సినిమాను వాయిదా వేస్తున్నాం. ఫిబ్రవరి నెలలోనే సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. అతి త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం అని అన్నారు. సినిమా గురించి బాలు మాట్లాడుతూ మహానగరంలో నివసించే నలుగురు అమ్మాయిల కథే ఈ సినిమా. హైదరాబాద్‌లో ఉండే ఈ నలుగురు అమ్మాయిలు ఫ్రెండ్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం గోవా వెళతారు. అక్కడ ఏం జరిగింది? అనేది ఆసక్తికరం. కథ, కథనాలు కొత్త తరహాలో ఉంటాయి. ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. న్యూ ఏజ్ సినిమా ఇది’’ అని అన్నారు.

More News

బడ్జెట్ 2020 ఎఫెక్ట్: ఆన్‌లైన్‌లోనే డిగ్రీ కోర్సులు!

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌-2020 వల్ల రైతులకు, విద్యారంగాలకు మాత్రం న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. అందేకే ఈ రెండు రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

'పలాస 1978' మూవీ నుండి నక్కిలీసు గొలుసు అనే సాంగ్ ను రిలీజ్ చేసిన డైరెక్టర్ సుకుమార్

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా  ‘‘పలాస 1978’’ .

జాతీయ భద్రతకే అత్యంత ప్రాధానం

జాతీయ భద్రతే మాకు అత్యంత ప్రాధాన్యం పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి వేధింపులు ఉండవు ఇక పన్ను చెల్లింపు దారుల చార్టర్ పన్ను ఎగవేత ఇక క్రిమినల్ నేరం కాదు..

పవన్‌-హరీశ్ కాంబోలో సినిమా : మైత్రీ మూవీస్ ప్రకటన

టాలీవుడ్ టాప్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీరాభిమానులకు మైత్రీ మూవీస్ తియ్యటి శుభవార్త అందించింది.

నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్న ‘శంకరాభరణం’

తెలుగు సినిమా కీర్తి కెరటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం ‘శంకరాభరణం’.