సెన్సార్ పూర్తిచేసుకున్న'అనుకోని ఓ కథ'
Saturday, April 8, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ఏ ఎం జె ఫిలిమ్స్ పతాకంపై దర్శక నిర్మాత ఏ ఎం జనార్దన్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం '' అనుకోని ఓ కథ ''. రాకేష్ - రమ్య జంటగా రూపొందిన ఈ చిత్రం రాయలసీమ , బెంగుళూర్ , హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది . ఇటీవలే నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తిచేసుకోవడంతో పాటు సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తిచేసుకుంది . బెంగుళూర్ లో సెన్సార్ జరుపుకున్న ఈ చిత్రానికి యు / ఏ సర్టిఫికెట్ ఇచ్చారు . పళని డి సేనాపతి అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అవుతుందని , అలాగే ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి డీప్ ఫారెస్ట్ లో షూటింగ్ చేశామని , తలకోన అందాలు మరో హైలెట్ గా నిలుస్తాయని అంటున్నాడు దర్శక నిర్మాత ఏ ఎం జనార్దన్ .
తక్కువ బడ్జెట్ లో పరిమిత రోజుల్లో తెరకెక్కించిన చిత్రం మా '' అనుకోని ఓ కథ '' అని తప్పకుండా ప్రేక్షకులను అలరించేలా మా సినిమా ఉంటుందని ధీమా వ్యక్తం చేసారు హీరో , హీరోయిన్ లు రాకేష్ - రమ్య . శ్రవణ్ ,కార్తీక్ , వాసవిరెడ్డి , రమ్యశ్రీ , మాదీ ,వెంకటరమణ ,తేజ ,అమృత ,రాజేంద్ర ,జ్యోతి , డబ్బింగ్ సురేష్ ,అర్జున్ రెడ్డి ,రాధాకృష్ణ ,అర్జున్ ,సోనీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సురేష్ బాబు ఛాయాగ్రహణం అందించాడు . కాగా ఈ చిత్రాన్ని మేలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాత ఏ ఎం జనార్దన్ .
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments