అనుదీప్ దర్శకత్వంలో మెగా మేనల్లుడు?
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకరు ‘జాతిరత్నాలు’తో పేరు తెచ్చుకుంటే.. ఒకరు ‘ఉప్పెన’తో పేరు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందని టాక్. ‘పిట్టగోడ’ సినిమాతో వచ్చి.. ‘జాతిరత్నాలు’తో డైరెక్టర్‌గా మంచి ముద్ర వేసుకున్న దర్శకుడు కేవీ అనుదీప్. ‘పిట్టగోడ’ తర్వాత ఐదేళ్లు గ్యాప్ వచ్చినప్పటికీ ఏ మాత్రం నిరాశ చెందకుండా అదిరిపోయే హిట్ ఇచ్చారు. తాజాగా జాతి రత్నాలు సినిమా నిర్మించిన దర్శకుడు నాగ్ అశ్విన్.. ఈ సినిమాలో నటించిన నవీన్ పొలిశెట్టితో పాటు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, రాహుల్ రామకృష్ణ, ప్రియ దర్శి తో పాటు దర్శకుడు అనుదీప్‌కి మంచి లైఫ్ ఇచ్చారు.
ఇక ‘ఉప్పెన’ సినిమాతో మెగా మేనల్లుడు, సాయితేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా అంచనాలను మించి వసూళ్లను రాబట్టింది. వైష్ణవ్ తేజ్ గ్రాఫ్‌ను ఊహించనంతగా పెంచేసింది. ఈ సినిమా చేసినప్పటి నుంచి వరుస ఆఫర్లు వైష్ణవ్‌ను వరిస్తున్నాయి. ఇప్పటికే వైష్ణవ్ క్రిష్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్‌తో కలిసి తన రెండవ సినిమాను కంప్లీట్ చేశాడు. ఈ సినిమా తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో పని చేయబోతున్నాడని టాక్ నడస్తోంది.
అయితే తాజా సమాచారం ప్రకారం వైష్ణవ్ తేజ్ - జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్‌ల కాంబినేషన్‌లో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ సినిమాని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తారని తెలుస్తోంది. మొత్తానికి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు భారీగానే పెరిగే అవకాశం ఉంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments