”అనుభవించు రాజా” ట్రైలర్ : నవ్వులు పండించిన రాజ్ తరుణ్, ఈసారైనా హిట్ గ్యారెంటీయేనా..?
Send us your feedback to audioarticles@vaarta.com
రాజ్ తరుణ్ హీరోగా శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో 'అనుభవించు రాజా' సినిమా రూపొందింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో కొత్త కథానాయిక తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఈ నెల 26న అనుభవించు రాజా రిలీజ్ కానుంది.
శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
గతంలో సీతమ్మ అందాలు..రామయ్య సిత్రాలు అనే సినిమా రాజ్ తరుణ్ తోనే చేశాడు శ్రీను. రిలీజ్ డేట్ అనౌన్స్ కావడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేసింది. దీనితో భాగంగానే బుధవారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఊళ్లో మైనర్ బాబు మాదిరిగా చెలరేగిపోయిన కుర్రాడు నగరానికి షిప్ట్ అయిన తరువాత సెక్యూరిటీ గార్డుగా మారిపోవడం, ప్రేమలో పడిపోవడం అనే లైన్ చుట్టూ కథను నడిపించారు. అలాగే పల్లెటూరు సరదాలు, పంతాలు, పట్టుదలలు ఇలా రెండూముడిపెట్టి కథను అద్భుతంగా అల్లారనిపిస్తోంది.
ఈ కథ ఇటు పల్లెలోను .. అటు నగరంలోనూ నడుస్తుంది. హీరోను జల్సారాయుడిగాను .. ఓ చిన్నపాటి జాబ్ చేసుకుంటున్నవాడిగాను చూపించారు. ఇక రాజ్‌తరుణ్ తనదైన కామెడీ టైమింగ్ చూపించారు. దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. కొంతకాలంగా రాజ్ తరుణ్ కి హిట్ పడలేదు. దాంతో ఆయన ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈసారైనా ఆయన ఆశలు ఫలిస్తాయో లేదో వేచిచూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments