అను.. మెగా నామ సంవ‌త్స‌రం?

  • IndiaGlitz, [Thursday,December 07 2017]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌.. ఇలా ఈ ముగ్గురు మెగా హీరోస్ తో జోడీక‌ట్టిన క‌థానాయిక‌లుగా త‌మ‌న్నా, శ్రుతి హాస‌న్‌, కాజ‌ల్‌, స‌మంత‌కి ప్ర‌త్యేక స్థానం ఉంది. అయితే.. వీరిలో ఏ ఒక్క‌రూ ఒకే ఏడాదిలో ఈ ముగ్గురు క‌థానాయ‌కుల‌తో సంద‌డి చేసిన సంద‌ర్భం లేదు. మ‌హా అయితే.. ఏ ఇద్ద‌రితోనో ఒకే సంవ‌త్స‌రంలో సంద‌డి చేసిన సంద‌ర్భం ఉంది.

అయితే.. కేర‌ళ‌కుట్టి అను ఇమ్మాన్యుయేల్ మాత్రం అందుకు భిన్నంగా.. వ‌చ్చే ఏడాది ఈ ముగ్గురు మెగా హీరోస్ తో తెర‌పై క‌నిపించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి జోడిగా అను న‌టించిన‌ అజ్ఞాత‌వాసి వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 10న విడుద‌ల కానుండ‌గా.. అల్లు అర్జున్‌తో అను క‌లిసి న‌టిస్తున్న నా పేరు సూర్య ఏప్రిల్ 27న సంద‌డి చేయ‌నుంది.

ఇక రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి సినిమాలో కూడా అను పేరునే ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఒక‌వేళ అది క‌న్‌ఫ‌ర్మ్ అయితే.. ఆ సినిమా ద‌స‌రాకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది కాబట్టి.. ఒకే ఏడాదిలో ఈ ముగ్గురు మెగా హీరోల‌తో అను సంద‌డి చేసిన‌ట్ల‌వుతుంది. మ‌రి.. అనుకి అలాంటి అరుదైన అవ‌కాశం ద‌క్కుతుందా? వెయిట్ అండ్ సీ!

More News

నేను అఖిల్ ని ఎలా చూడాలనుకున్నానో అలా 'హలో'లో చూశాను - నాగార్జున

యూత్ కింగ్అఖిల్ హీరోగా కళ్యాణి ప్రియదర్శిన్హీరోయిన్గా అన్నపూర్ణ స్టూడియోస్అండ్మనం ఎంటర్ ప్రైజెస్ సమర్పణలో 'మనం' ఫేమ్విక్రమ్కె.కుమార్దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఫ్యామిలీ, రొమాంటిక్ యాక్షన్చిత్రం 'హలో'.

'ఆక్సిజన్' భవిష్యత్ తరాలు తప్పక చూడాల్సిన చిత్రం

గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆక్సిజన్". గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఏమాన్యూల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మించారు.

మ‌హేష్ టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్ ఆ రోజేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తోన్న సినిమా 'భరత్ అనే నేను' (ప్ర‌చారంలో ఉన్న పేరు).  ఇందులో మ‌హేష్ ముఖ్య‌మంత్రిగా సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

విక్రమ్-సమంతల '10' డిసెంబర్ 15న విడుదల

వెర్సటైల్ యాక్టర్ విక్రమ్, అక్కినేని సమంత జంటగా నటించగా తమిళంలో రూపొంది మంచి విజయం సొంతం చేసుకొన్న చిత్రం '10 ఎండ్రాతుకుల్ల'. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని '10' పేరుతో తెలుగులో శ్రీ సుబ్రమణ్యేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై జి.సుబ్రమణ్యం-ఎం.సుబ్బారెడ్డి-రామారావు చింతపల్లి సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిసĺ

'సైరా న‌ర‌సింహారెడ్డి' షూటింగ్ ప్రారంభం

అటు అభిమానులు..ఇటు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్న‌ 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి' బుధ‌వారం అధికారికంగా సెట్స్ కు వెళ్లింది.