మ‌రో మెగా హీరోతో అను

  • IndiaGlitz, [Wednesday,January 24 2018]

సంక్రాంతికి విడుద‌లైన 'అజ్ఞాత‌వాసి' చిత్రంలో ప‌వ‌ర్ స్టార్‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి జోడీగా సంద‌డి చేసింది కేర‌ళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్‌. సూర్యకాంతం పాత్ర‌లో అమాయ‌కంగా కనిపించిన ఈ సుంద‌రి.. ప్ర‌స్తుతం మ‌రో మెగా హీరో, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ స‌ర‌స‌న 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే చేస్తోంది. కాగా, తాజా స‌మాచారం ప్రకారం.. ఈ ముద్దుగుమ్మకి మ‌రో మెగా హీరోకి జోడీగా న‌టించే అవ‌కాశం దొరికింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

విన్న‌ర్ త‌రువాత యువ క‌థానాయ‌కుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌, ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతోంది. అందులో క‌థానాయిక‌గా అను ఇమ్మాన్యుయేల్ న‌టించే అవ‌కాశం ఉంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక వార్త వెలువ‌డుతుంద‌ని స‌మ‌చార‌మ్‌.

అంతేకాకుండా.. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రాజ‌మౌళి రూపొందించ‌నున్న చిత్రంలో.. చ‌ర‌ణ్‌కి జోడీగా అను న‌టించే అవ‌కాశం ఉంద‌ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి.. అనుకి మెగా ఆఫ‌ర్స్ బాగానే ఉన్నాయ‌న్న‌మాట‌.

More News

ఆ ద‌ర్శ‌కుల‌కి ఓకే చెప్పిన గోపీచంద్‌

కుటుంబకథా చిత్రాల్లోనే మాస్, యాక్షన్ అంశాలను కూడా ఉండేటట్లు చూసుకునే క‌థానాయ‌కుడు గోపీచంద్. ఇటువంటి కథలతోనే ఒకప్పుడు వరుస హిట్లను అందుకున్న ఈ యాక్ష‌న్‌ హీరోకి.. 'లౌక్యం' త‌రువాత చేసిన సినిమాలేవీ విజ‌యాల‌ను అందించ‌లేక‌పోయాయి. ప్రస్తుతం డెబ్యు డైరెక్టర్ చక్రి దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని చేస్తున్నారు గోపీచంద్. మ

నాగ్‌, నాని.. డేట్ ఫిక్స‌య్యింది

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేష‌న్‌లో ఓ మ‌ల్లీస్టార‌ర్ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న‌ ఈ చిత్రంలో నాగార్జున డాన్ పాత్రలో కనిపించనుండగా...నాని డాక్టర్ పాత్రలో మెప్పించనున్నారని సమాచారం.  ఈ చిత్రాన్ని భ‌లే మంచి రోజు, శమంత‌క‌మ‌ణి చిత్రాల ద‌ర్శ‌కుడు శ్ĸ

ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గా అనసూయ

డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న గాయత్రి చిత్రం ఫిబ్రవరి 9 న విడుదల కానుంది. సంక్రాంతికి విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన రాగా, 'రాయలసీమ రామన్న చౌదరి' తరహాలో మోహన్ బాబు ఓ పవర్ఫుల్ రోల్ లో కనిపించనుండటంతో చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.

బన్ని సినిమా ముందుకా? వెనక్కా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ వేసవిలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు.

అడివిశేష్ , శివాని జంటగా ఫిబ్రవరిలో కొత్త చిత్రం ప్రారంభం

లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అడివి శేష్ హీరోగా ఓ కొత్త చిత్రం షూటింగ్ ఫిబ్రవరిలో