నాగ చైతన్యకి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ ?
Send us your feedback to audioarticles@vaarta.com
అను ఇమ్మాన్యుయేల్.. అనతి కాలంలోనే అగ్ర కథానాయకుల పక్కన ఆఫర్లు సొంతం చేసుకుంటున్న క్రేజీ హీరోయిన్ పేరిది. నాని కథానాయకుడిగా నటించిన మజ్ను చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కేరళకుట్టి.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్‌లో ఒకరిగా నటిస్తోంది. మరోవైపు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న నాపేరు సూర్య చిత్రంలో సోలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రెండు చిత్రాలూ వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
అలాగే ఈ ముద్దుగుమ్మకి మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఆఫర్ వచ్చిందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మహానుభావుడుతో తాజాగా హిట్ ని సొంతం చేసుకున్న మారుతి.. యువ కథానాయకుడు నాగచైతన్యతో శైలజారెడ్డి అల్లుడు పేరుతో ఓ సినిమాని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇందులోనూ అను ఇమ్మాన్యుయేల్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేశారని తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com