దర్శకుడితో పీకల్లోతు ప్రేమలో ఉన్న అను ఇమ్మాన్యుయేల్?
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకులతో హీరోయిన్లు ప్రేమలో పడటం కామన్. ఇప్పటికే ఎందరో హీరోయిన్లు దర్శకులతో ప్రేమాయణం నడపడమే కాదు.. పెళ్లి కూడా చేసుకున్నారు. తాజాగా మరో ముద్దుగుమ్మకు దర్శకుడు ప్రేమ పాఠాలు చెబుతున్నట్టు సమాచారం. ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు.. అను ఇమ్మాన్యుయేల్. ఈ ముద్దుగుమ్మ ఓ దర్శకుడితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు సమాచారం. 2017లో వచ్చిన ‘ఆక్సిజన్’ సినిమా దర్శకుడు జ్యోతి కృష్ణతో డేటింగ్‌లో ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది.
‘ఆక్సిజన్’ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం చిగురించిందని తెలుస్తోంది. ఆ స్నేహం కాస్తా అనంతరం ప్రేమగా మారినట్టు సమచారం. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారంపై అను ఇమ్మాన్యుయేల్ కానీ, జ్యోతి కృష్ణ కానీ ఇంతవరకూ స్పందించలేదు. కాగా.. దర్శకుడు జ్యోతికృష్ణ.. ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం కుమారుడు కావడం గమనార్హం.
కాగా..అను ఇమ్మాన్యుయేల్ ఈ మధ్యే బెల్లంకొండ శ్రీనివాస్ సరసన 'అల్లుడు అదుర్స్'లో నటించింది. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. కోలీవుడ్‌లోనూ రెండు, మూడు సినిమాల్లో అను ఇమ్మాన్యుయేల్ నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శర్వానంద్, సిద్దార్థ్ కలిసి నటిస్తున్న 'మహాసముద్రం'లో ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా అయినా ఆమెకు కలిసొస్తుందో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments