కీర్తి బాట‌లో అను ఇమ్మాన్యుయేల్‌

  • IndiaGlitz, [Thursday,November 30 2017]

కళకి అవధులు గాని, భాషా భేదం గాని లేదని పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన, వస్తున్న నటీమణులు తెలియజేస్తున్నారు. తెలుగు సినిమాలు చేస్తూ, తెలుగులో వారే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటే.. ప్రేక్షకులు వారిని తెలుగు అమ్మాయిలుగా ట్రీట్ చేస్తారని భావించి ఈ భామలు తమ తమ క్యారెక్ట‌ర్స్‌ కి డబ్బింగ్ చెప్పుకోవడానికి కూడా వెనుకాడడం లేదు.

నిత్యమీనన్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ లాంటి క‌థానాయిక‌లు ఇలా చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గర‌య్యారు. ఇప్పుడు వారి బాట‌లోనే నడుస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిన్స్. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'అజ్ఞాతవాసి'. ఇందులో కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఈ సినిమాకి ఈ మధ్యనే కీర్తి సురేష్ డ‌బ్బింగ్ చెప్పుకుంది. ఆ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు కీర్తి బాట‌లోనే వెళ్లి మ‌రో హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయేల్ కూడా డబ్బింగ్ చెప్పుకుంది. ఈ విషయం అను ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఇలా త్రివిక్ర‌మ్ సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్స్ కూడా డబ్బింగ్ చెప్పుకోవడం ఇదే మొదటి సారి. వీరు చెప్పుకున్న డబ్బింగ్ ఎలా ఉందో తెలియాలంటే ఈ సినిమా విడుదల తేది జనవరి 10 వరకు ఆగాల్సిందే.

More News

బన్నీ, మహేష్ ల మధ్య పోటీ లేనట్లేనా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా 'నా పేరు సూర్య'. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నఈ సినిమా ద్వారా ర‌చ‌యిత వక్కంతం వంశీ డైరెక్టర్ గా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.

`అజ్ఞాతవాసి` ఆడియో ఎప్పుడంటే...

పవర్స్టార్ పవన్కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'అజ్ఞాతవాసి'. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటించారు.

రెహమాన్.. 25 ఏళ్ల తరువాత

‘రోజా’(1992).. భారతీయ చిత్ర పరిశ్రమకి సంబంధించినంతవరకు ఈ సినిమా ఓ సంచలనం. కమర్షియల్ గా మంచి విజయం సాధించడమే కాకుండా.. ఓ సంచలన సంగీత దర్శకుడిని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిందీ మణిరత్నం చిత్రం.

రిపబ్లిక్ డే సందర్భంగా 'విశ్వరూపం-2'

లోకనాయకుడు కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విశ్వరూపం 2’. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే మళ్లీ ఈ సినిమా షూటింగ్ చెన్నైలో మొదలయ్యింది. ఒకటి, రెండు వారాల్లో ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోనుందని తెలిసింది.

'ఖడ్గం'కి 15 ఏళ్లు

దేశ భక్తి నేపథ్యంలో రూపొందే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. వాటిలో విజయం సాధించే సినిమాల సంఖ్య కూడా అంతే అరుదుగా ఉంటుంది. అలాంటి విజయవంతమైన చిత్రాల్లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ రూపొందించిన ఖడ్గం ఒకటి.