మహిళలకు గుడ్ న్యూస్.. యాంటీ ‘రేప్’ చీరలొచ్చేశాయ్!
Send us your feedback to audioarticles@vaarta.com
భారతదేశంలో ఫ్యాషన్లకు ఏ మాత్రం కొదువలేదు.. టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో అంతకు రెట్టింపు స్థాయిలో ఫ్యాషన్ కూడా రెట్టింపు అవుతోంది. బట్టల విషయానికొస్తే ఎక్కడా లేని.. దొరకని డిజైన్స్ మెట్రో నగరాల్లో దొరుకుతుంటాయ్. కొన్ని చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉన్నా.. మరికొన్ని మాత్రం చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి. కొందర్ని కొన్ని కొన్ని ఫ్యాషన్ దుస్తుల్లో చూస్తే అబ్బా అనిపిస్తుందంతే. అందుకే ఎక్కడ చూసిన కుప్పలు తెప్పలుగా.. గల్లీ గల్లీలో పదుల సంఖ్యలో పుట్టగొడుగుల్లా బట్టల షాపులుంటాయ్..! ఈ ఫ్యాషన్ రంగానికి ఏ మాత్రం గిరాకి తగ్గే పరిస్థితుల్లేవ్.
ఇక అసలు విషయానికొస్తే.. ఆడవాళ్లు వేసుకునే బట్టలు వల్ల ఎక్కువగా రేప్‌లు జరుగుతుంటాయ్.. వాళ్లు డ్రస్సింగ్ స్టైల్ సరిగ్గా ఉండదు.. ఏది దాచుకోవాలో వాటిని బయటికి చూపిస్తుంటారు అందుకే లేనిపోని అనర్థాలు జరిగిపోతుంటాయని విమర్శకులు విమర్శలు గుప్పిస్తుంటారు.! అంతేకాదు.. మన దేశంలో మహిళలు వేసుకునే డ్రెస్సులపై ఎప్పటి నుంచో వివాదాలు నడుస్తున్న విషయం విదితమే. ఇటీవల ఢిల్లీలో ఇటీవలే ఓ మహిళ రెస్టారెంట్‌కు వెళ్లగా.. అక్కడ పొట్టి దుస్తులు వేసుకున్న అమ్మాయిలు ఆమెకు కనిపించగా..వారిపై ఆ మహిళ అసభ్యకర కామెంట్లు చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మహిళ చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా కొందరు యూత్ ఓ స్వచ్ఛంద సంస్థ యాంటీ రేప్ చీరల పేరిట కొన్ని ప్రత్యేకమైన చీరలను డిజైన్ చేసి వాటిని ఆన్లైన్లో అమ్మకానికి పెట్టింది.
ఇలాంటి చీరల కొనుగోలుకు ఇదిగో సంప్రదించండి అంటూ.. ఒక వెబ్ సైట్ అందుబాటులోకి తెస్తోంది. ఈ సైట్లో రకరకాలు చీరలు పలు డిజైన్స్‌లో ఉన్నాయి. ముఖ్యంగా శరీరం మొత్తం కప్పి ఉంచే చీరలే ఇవన్నీ. చేతులు మొదలుకుని ముఖం.. పాదాల వరకు అన్ని భాగాలు కప్పే ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బురఖాలో చీరలున్నాయ్. కాగా.. ఇలాంటి దుస్తులను డిజైన్ చేసిన స్వచ్ఛంద సంస్థపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు... ఈ సంస్థ తయారు చేసిన చీరలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ చీర కట్టుకుని బయటికెళ్లే మహిళల ముఖ భాగంలో కళ్లు, జుట్టు తప్ప ఇంకేం కనపడవ్. ఈ చీరలు కొనుగోలుకు చేయడానికి యూత్ బాగా ఇష్టపడుతున్నారు. సో.. ఒక రకంగా చెప్పాలంటే ఇది మహిళలకు గుడ్ న్యూసే అని చెప్పుకోవచ్చు మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments