జులై 7న A సర్టిఫికేట్ తో రష్మి గౌతమ్ 'అంతం' విడుదల

  • IndiaGlitz, [Wednesday,June 22 2016]

గుంటూరు టాకీస్ లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రంతో యువ‌తని కేరింత‌లు కొట్టించిన ర‌ష్మిగౌతమ్ ప్ర‌దాన‌పాత్ర‌లో న‌టించిన చిత్రం అంతం జులై 7 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లవుతుంది. ద‌ర్శ‌క‌ నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ చాలా పెర్‌ఫెక్ట్ బ‌డ్జెట్ లో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించిన ఈ చిత్రం ట్రేడ్ లో విప‌రీత‌మైన క్రేజ్ రావ‌టం, మెత్తం రెండు రాష్ట్రాల‌కి ఫ్యాన్సి రేట్ కి బిజినెస్ చేయ‌టం విశేషం. రష్మీ అందచందాలతో పాటు పెర్ పార్మెన్స్ కు స్కోప్ ఉన్న అద్బుత‌మైన పాత్ర‌లో నటించింది. ఎప్ప‌టిక‌ప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎంచుకుంటూ త‌న కెరీర్ ని అందంగా మ‌లుచుకునే రష్మీ గౌతమ్ కి ఈ చిత్రం చాలా మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఇటీవ‌లే సెన్సారు కార్క‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న ఈచిత్రానికి A స‌ర్టిఫికేట్ ని అందించారు.
ఈ సందర్బంగా దర్శక నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ మాట్లాడుతూ.... మా అంతం చిత్రం ఇప్పటివరకు రాని అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ అని గర్వంగా చెప్పగలను. అదే మాట సెన్సారు వారు చెప్ప‌టం మాకు A స‌ర్టిఫికేట్ ఇవ్వ‌టం చాలా ఆనందంగా వుంది. గుంటూరు టాకీస్ చిత్రంలో చాలా మంచి ఫెర్‌ఫార్మెన్స్ ఇచ్చిన రష్మీ గౌతమ్ మా చిత్రంలో గ్లామర్ తో పాటు టెర్రిఫిక్ పెర్ పార్మెన్స్ ఇచ్చింది. ఈ చిత్రం చూసిన త‌రువాత హీరోయిన్ ర‌ష్మి అంద‌మైన ఫెర్‌ఫార్మెన్స్ గురించి త‌ప్ప‌కుండా మాట్లాడుతారు. గుంటూరు టాకీస్ చిత్రం త‌రువాత ర‌ష్మి న‌టించిన చిత్రం కావ‌టం తో సిని ప్రేక్ష‌కుల్లో విప‌రీత‌మైన క్రేజ్ వుంది.
థ్రిల్ నే కాకుండా అన్ని ర‌కాట ర‌సాలు ఈ చిత్రంలో పొందుప‌రిచాము. త‌ప్ప‌కుండా ప్ర‌తి ప్రేక్ష‌కుడిని ఆక‌ట్టుకుంటుంది. మాలాంటి చిన్న చిత్రాన్ని ఇండ‌స్ట్రి పెద్ద‌లు ఆశీర్వ‌దించినందుకు పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాము. మేము విడుద‌ల చేసిని ట్రైల‌ర్ కి హ్యుజ్ రెస్పాన్స్ రావ‌టం విశేషం. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని A సర్టిఫికెట్ పొందిన మా అంతం చిత్రాన్ని జులై 7 న విడుద‌ల చేయ‌నున్నాము. అని అన్నారు.

More News

గౌతమీపుత్ర శాతకర్ణి క్లైమాక్స్ డీటైల్స్..

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.

ఓం నమో వెంకటేశాయ షూటింగ్ ప్రారంభించేది ఆరోజే..

కింగ్ నాగార్జున-దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు-స్వరవాణి కీరవాణి ఈ ముగ్గురు కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం ఓం నమో వెంకటేశాయ.

బ్రిటిష్ ఆత్మ‌కు - సౌతిండియ‌న్ ఆత్మ‌కు మ‌ధ్య ఫైటే ఈ దొర : స‌త్యరాజ్

స‌త్యరాజ్, శిబి స‌త్యరాజ్, బిందు మాధ‌వి ప్రధాన పాత్ర‌లో రూపొందిన త‌మిళ చిత్రం జాక్స‌న్  దొరై. ఈ చిత్రాన్ని ధ‌ర‌ణి ధ‌ర‌న్ తెర‌కెక్కించారు. త‌మిళ్ లో రూపొందిన ఈ హ‌ర్ర‌ర్ చిత్రాన్ని దొర టైటిల్ తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. జులై 1న దొర చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

మురుగుదాస్ మూవీలో న్యూలుక్ తో మ‌హేష్‌..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా మురుగుదాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. దాదాపు 100 కోట్ల భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్ర‌సాద్, ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

చిరు సినిమాకు రచయితలెక్కువయ్యారా..?

దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత సినీ రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తున్నాడు.