అంతా మనమంచికే ఆడియో విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
ఎలైట్ పిక్చర్స్ , స్ప్రింగ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'అంతా మనమంచికే'. ఈ చిత్ర ఆడియో వేడుక గురువారం సాయంత్రం సారథి స్టూడియో లో అతిరథ మహారథుల మధ్య ఘనంగా జరిగింది. ఈ చిత్ర ఆడియో సిడి ని రాజకందుకూరి విడుదల చేసి మొదటి సీడి ని తుమ్మల పల్లి రామసత్యనారాయణకు అందచేయగా, ట్రైలర్ ను వి. ఎన్ ఆదిత్య విడుదల చేసారు,
అనంతరం రాజకందుకూరి మాట్లాడుతూ.. పాటలు చాలా బాగున్నాయి.. ట్రైలర్ ను చూస్తుంటే సినిమాలో మంచి కంటెంట్ ఉన్నట్టు కనిపిస్తోంది. హీరో హీరోయిన్స్ చాలా బాగా నటించారని కూడా తెలుస్తోంది. అందరికీ నా శుభాభినందనలను తెలియచేస్తున్నా అన్నారు.
తుమ్మల పల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. 'అంతా మనమంచికే' అనే మంచి టైటిల్ పెట్టడమే ఈ చిత్రానికి పాజిటివ్ గా అనిపిస్తోంది, దీనికి తగ్గట్టు ఈ చిత్ర ప్రమోషన్ ను సరిగ్గా చేయగలిగితే తప్పకుండా విజయం సాధింస్తుందని అన్నారు. వి ఎన్ ఆదిత్య మాట్లాడుతూ ట్రైలర్ చాలా నచ్చింది నాకు, ఇందులో నటించిన, టెక్నీషియన్స్ కు నా అభినందనలు తెలియచేస్తున్నా అన్నారు.
లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ.. మ్యూజిక్ డైరెక్టర్ స్వర ను నేనె పరిచయం చేశాను, మంచి పాటలు అందించాడు, ఈ చిత్ర దర్శక నిర్మాతలకు ఆల్ ది బెస్ట్ అని తెలిపారు. నిర్మాత మహబూబ్ అలీ ఖాన్ మాట్లాడుతూ హీరో, హీరోయిన్స్ ఇష్టపడి కష్టపడి పనిచేశారు, సినిమా బాగిచ్చింది, వచ్చే నెలలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు..
ఇక హీరో ఆర్య మాట్లాడుతూ.. ఇది నా తొలిచిత్రం, దర్శకుడు ఎమ్ కె షరీఫ్ చాలా బాగా తెరకెక్కించాడు, ఈ చిత్ర ఆడియో వేడుకకు విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలను తెలియచేస్తున్నా అని చెప్పారు.
సంగీత దర్శకుడు స్వరన్ మాట్లాడుతూ... ఇష్టపడి కష్టపడి పని చేసాను, సంగీతం బాగొచ్చిందని అందరూ అంటున్నారు, ఈ సినిమాతో నాకు మంచి పేరు వచ్చి మరిన్ని అవకాశాలు పొందుతానని ఆశిస్తున్నా అన్నారు.
హీరోయిన్ ఆరతి మాట్లాడుతూ .. డైరెక్టర్ చాలా ఫ్యాషన్ తో పని చేశారు, సినిమా కథ చాలా బాగుంది.. నాకు అవకాశాన్ని ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలు అని అన్నారు.
చివరిగా దర్శకుడు ఎమ్. కె షరీఫ్ మాట్లాడుతూ... పెద్దల సమక్షంలో మా ఆడియో వేడుక జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది, చిత్రానికి పని చేసిన ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ నాకెంతో సహకారాన్ని అందించారు, నిర్మాత నేను ఆడిగినవన్నీ ఇచ్చి పూర్తి స్వేచ్ఛ ను ఇచ్చి నన్ను నమ్మారు ఈ సందర్భంగా ఈ సినిమా విడుదల వరకు నాకు తోడ్పడిన ప్రతిఒక్కరికీ నా కృతజ్ఞలను తెలియచేస్తున్నా, వచ్చేనెలలో సినిమా విడుదల ఉంటుందన్నారు.
ఆర్యన్, ఆరతి, సందీప్, సుమన్ శెట్టి,బాషా నటిస్తున్న ఈ చిత్రానికి డి. ఓ. పి: కృష్ణ జక్కుల, లిరిక్స్: లక్ష్మణ్ గంగ, సంగీతం: స్వరన్, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: ఎమ్. కె. షరీఫ్, నిర్మాతలు: మహాబూబ్ అలీ ఖాన్, ఎమ్. కె షరీఫ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout