నాని ‘‘ అంటే సుందరానికి ’’ టీజర్ : నవ్వులు పూయిస్తున్న నేచురల్ స్టార్
Send us your feedback to audioarticles@vaarta.com
నేటీతరం హీరోల్లో అత్యంత ప్రతిభావంతమైన నటుల్లో ఒకడిగా మన్ననలు పొందుతున్న నాని.. హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వస్తున్నారు. మధ్యలో కాస్త డౌన్ అయినా ఇటీవల శ్యామ్ సింగరాయ్‌తో మళ్లీ ట్రాక్‌లోకి ఎక్కేశాడు నాని. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘‘అంటే సుందరానికి’’. మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నానికి ఆ జోనర్ అంత కలిసి రావట్లేదు. తనకు బాగా కలిసొచ్చిన కామెడీ తరహా కథల వైపు మళ్లీ మొగ్గుచూపారు నాని. అలా చేస్తున్నదే ‘అంటే సుందరానికి’’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని సరసన రాజా రాణి ఫేమ్ నజ్రీయా నజ్రిమ్ నటిస్తున్నారు. నరేశ్, రోహిణి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆల్‌మోస్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 10న విడుదల కానుంది.
దీంతో ‘‘ అంటే సుందరానికి’’ ప్రమోషనల్ కార్యక్రమాలను స్టార్ట్ చేశారు . ఈ మేరకు బుధవారం టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. 2 నిమిషాల 16 సెకన్ల నిడివి వున్న ట్రైలర్ పూర్తిగా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఇక ట్రైలర్ విషయానికి వెళ్తే... ఇది సుందర్ ప్రసాద్ అనే బ్రాహ్మణ కుర్రాడి కథ. సుందర్‌పై పుత్ర వాత్సల్యంతో యజ్ఞాలు, హోమాలు, పూజలు, పునస్కారాలు, తాయెత్తులు… ఇలా అన్నీ చేస్తుంటారు తల్లీదండ్రులు.
అతనికి ద్విచక్రవాహన గండం ఉందని… డొక్కు స్కూటర్, చివరికి సైకిల్ కూడా ఇవ్వడం మానేస్తారు. అలాంటి బ్రాహ్మణ కుర్రాడు.. ఓ క్రిస్టియన్ యువతితో లవ్‌లో పడతాడు. వారి మధ్య జరిగే ప్రేమ, ఇరు కుటుంబాల సంఘర్షణ, నాని కామెడీ, నజ్రీయా అందాలతో ‘‘సుందరాన్ని’’ బాగా డీల్ చేసినట్టు కనిపిస్తుంది. చివరిలో `అంటే..` అంటూ అందులోని పాత్రలు షాక్ కొట్టినట్లు మాట్లాడటంతో ఏం జరిగిందన్న దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అంటే.. ఇంకేదో సస్పెన్స్ ఈ సినిమాలో ఉందన్నమాట. మరి సుందరానికి ఏం జరిగిందో.. జరగబోతుందో తెలియాలంటే జూన్ 10 వరకు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com