Quantumania: 17న 'యాంట్ - మేన్ అండ్ ద వాస్ప్ : ద క్వాంటమేనియా'
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచ వ్యాప్తంగా ఆబాలగోపాలాన్నీ అలరిస్తోన్న మార్వెల్ కామిక్స్ ఈ సారి 'యాంట్ -మేన్ అండ్ ద వాస్ప్: ద క్వాంటమేనియా' తో ఫిబ్రవరి 17న జనం ముందుకు వస్తోంది. సైంటిఫిక్ ఫిక్షన్ గా రూపొందిన ఈ చిత్రం కథ, కథనం అందరినీ అలరించే రీతిలో ఉందని ప్రీమియర్ చూసిన వారు ప్రశంసిస్తున్నారు. సూపర్ హీరోస్ స్కాట్ లాంట్, హోప్ వాన్ డైన్ మరోసారి యాంట్ మేన్, ద వాస్ప్ గా అలరించడానికి సిద్ధమయ్యారు. పేటన్ రీడ్ దర్శకత్వంలో ఇంతకు ముందు తెరకెక్కిన 'యాంట్ మేన్' సీరీస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇప్పుడు మరోమారు
పేటన్ రీడ్ తనదైన పంథాలో ఈ 'యాంట్-మేన్ అండ్ ద వాస్ప్: ద క్వాంటమేనియా'ను తెరకెక్కించారు. ఈ సారి కథ విషయానికి వస్తే యాంట్ -మేన్ స్కాట్ లాంగ్, ద వాస్ప్ హోప్ వాన్ డైన్ ఓ విచిత్ర ప్రపంచంలోకి అడుగు పెడతారు. వారితో పాటు హాంక్ తల్లిదండ్రులు జానెట్ వాన్ డైన్, హాంక్ ఫైమ్, స్కాట్ కుమార్తె కాసీ లాంగ్ కలసి మొత్తం కుటుంబం క్వాంటమ్ సామ్రాజ్యాన్ని వెదుకుతూ పోతుంది. వారికి వింత వింత జీవులు తారసపడతాయి. వాటితో సంభాషిస్తూ క్వాంటమ్ సామ్రాజ్యంలో సాహసాలకు తెరతీస్తారు. ఆ తరువాత ఏమయింది అన్నదే ఆసక్తి కరమైన అంశం.
ఈ చిత్రంలో స్కాట్ లాంగ్ గా పాల్ రూడ్, హోప్ వాన్ డైన్ గా ఎవాంజలిన్ లిల్లీ, జానెల్ వాన్ డైన్ గా మిచెల్ పిఫర్, హాంక్ పైమ్ గా మైఖేల్ డగ్లాస్ ('బేసిక్ ఇన్ స్టింక్ట్' ఫేమ్), కాసీ లాంగ్ గా క్యాథరిన్ న్యూటన్ నటించారు. జోనాథన్ మేజర్స్ ఇందులో కాంగ్ పాత్రలో అలరించనున్నారు. ఈ సినిమాకు కెవిన్ ఫీగె, స్టీఫెన్ బ్రౌసార్డ్ నిర్మాతలు. లాస్ ఏంజెలిస్ లో ఈ మూవీ ప్రీమియర్ చూసిన వారందరూ మళ్లీ మళ్ళీ చూడాలని తపిస్తున్నారు. ఫిబ్రవరి 17 ఈ సినిమా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. సో గెట్ రెడీ టు సీ 'యాంట్-మేన్ అంద్ ద వాస్ప్: క్వాంటమేనియా'!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout