ANR Centenary:అన్నపూర్ణ స్టూడియోస్‌లో అక్కినేని శతజయంతి వేడుకలు.. ఏఎన్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంకయ్య

  • IndiaGlitz, [Wednesday,September 20 2023]

దిగ్గజ నటుడు, దివంగత అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏఎన్ఆర్ విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఆ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ఏఎన్ఆర్ అంటే తనకు ఎంతో అభిమానమన్నారు. ఆయన మహానటుడని, అలాగే గొప్ప వ్యక్తిత్వం , ఉన్నత విలువలు పాటించేవారని వెంకయ్య తెలిపారు. చివరి శ్వాస వరకు నటించిన నటుడు ఏఎన్ఆర్ తప్పించి మరొకరు లేరని ప్రశంసించారు.

తెలుగు కనుమరుగవుతుందేమోనని భయంగా వుంది:

ఆయన భాష, వేషం, వ్యక్తిత్వం వీటిలో కొంతైనా ఇప్పటి తరం అందిపుచ్చుకోవాలని వెంకయ్య నాయుడు కోరారు. నాగేశ్వరరావు కుటుంబ సభ్యులంతా తెలుగులోనే మాట్లాడటం తనకు ఆనందంగా వుందని.. ఇప్పటి పరిస్థితుల్లో తెలుగు కనుమరుగవుతుందేమోన్న భయం పుట్టుందని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషంటే ఏఎన్ఆర్‌కు ఎంతో అభిమానమని.. భాషపోతే శ్వాస పోతుందని, శ్వాస పోతే అంతా పోతుందని ఆయన తెలిపారు.

ఏఎన్ఆర్ ఒక నట విశ్వవిద్యాలయం:

నాగేశ్వరరావు ఒక నట విశ్వ విద్యాలయమని.. ఆయన తన జీవితానికి ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకునేవారని వెంకయ్య నాయుడు చెప్పారు. తెలుగు ప్రజల గుండెల్లో ఏఎన్ఆర్ ఎప్పటికీ జీవించే వుంటారని ఆయన పేర్కొన్నారు. అక్కినేని జీవితం నుంచి నేటి యువత స్పూర్తి పొందాలని వెంకయ్య నాయుడు సూచించారు. ఇటీవల సినిమాల్లో వాడుతున్న భాష బాగుండటం లేదని, డబుల్ మీనింగ్ వచ్చేలా పదాలు వాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాజకీయం కంటే ప్రజలపై సినిమా ప్రభావం ఎక్కువని వెంకయ్య నాయుడు చెప్పారు.

తరలివచ్చిన సినీ ప్రముఖులు :

ఇకపోతే.. అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్, అల్లు అరవింద్, రాం చరణ్ , మహేశ్ బాబు, బ్రహ్మానందం, మురళీ మోహన్, శ్రీకాంత్, జగపతి బాబు, మంచు విష్ణు, దిల్‌రాజు, నాని, సుబ్బరామిరెడ్డి తదితరులు హాజరై ఏఎన్ఆర్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

More News

Bigg Boss 7 Telugu : రతిక - ప్రశాంత్ గొడవ, శివాజీ పవర్ అస్త్రను కొట్టేసిన అమర్‌దీప్ , ఇంట్లో గలాటా

బిగ్‌బాస్ తెలుగు 7 విజయవంతంగా మూడో వారానికి చేరుకుంది. సోమవారం నామినేషన్స్ పర్వంగా ముగియగా..

Nara Lokesh:‘‘జాతి ’’ మీడియా కాదు లోకేషా.. జాతీయ మీడియా , అర్ణాబ్‌కు అడ్డంగా దొరికిపోయిన చినబాబు

టీడీపీ భావి వారసుడు నారా లోకేష్ సమర్ధతపై సొంత పార్టీలోనే ఎవరికి నమ్మకం లేదన్నది వాస్తవం.

Chandrababu Naidu:చంద్రబాబుకు మరో షాక్.. ఏపీ ఫైబర్‌నెట్ స్కాంలో పీటీ వారెంట్, అసలు ముద్ధాయి ఆయనేనన్న సీఐడీ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో

Justin Trudeau:ఖలిస్తాన్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ .. కెనడా ప్రధాని ట్రూడో సంచలన వ్యాఖ్యలు

భారత్ - కెనడా మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. సిక్కు వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం వుండొచ్చంటూ

Bigg Boss 7 Telugu : ఈ వారం నామినేషన్స్‌లో ఏడుగురు .. అమర్‌దీప్‌కు షాకిచ్చిన శివాజీ, సందీప్

బిగ్‌బాస్ 7 తెలుగు విజయవంతంగా మూడో వారంలోకి ప్రవేశించింది. గత వారం ఇంటి నుంచి షకీలా ఎలిమినేట్ అయ్యారు.