ANR Centenary:అన్నపూర్ణ స్టూడియోస్‌లో అక్కినేని శతజయంతి వేడుకలు.. ఏఎన్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంకయ్య
Send us your feedback to audioarticles@vaarta.com
దిగ్గజ నటుడు, దివంగత అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏఎన్ఆర్ విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఆ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ఏఎన్ఆర్ అంటే తనకు ఎంతో అభిమానమన్నారు. ఆయన మహానటుడని, అలాగే గొప్ప వ్యక్తిత్వం , ఉన్నత విలువలు పాటించేవారని వెంకయ్య తెలిపారు. చివరి శ్వాస వరకు నటించిన నటుడు ఏఎన్ఆర్ తప్పించి మరొకరు లేరని ప్రశంసించారు.
తెలుగు కనుమరుగవుతుందేమోనని భయంగా వుంది:
ఆయన భాష, వేషం, వ్యక్తిత్వం వీటిలో కొంతైనా ఇప్పటి తరం అందిపుచ్చుకోవాలని వెంకయ్య నాయుడు కోరారు. నాగేశ్వరరావు కుటుంబ సభ్యులంతా తెలుగులోనే మాట్లాడటం తనకు ఆనందంగా వుందని.. ఇప్పటి పరిస్థితుల్లో తెలుగు కనుమరుగవుతుందేమోన్న భయం పుట్టుందని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషంటే ఏఎన్ఆర్కు ఎంతో అభిమానమని.. భాషపోతే శ్వాస పోతుందని, శ్వాస పోతే అంతా పోతుందని ఆయన తెలిపారు.
ఏఎన్ఆర్ ఒక నట విశ్వవిద్యాలయం:
నాగేశ్వరరావు ఒక నట విశ్వ విద్యాలయమని.. ఆయన తన జీవితానికి ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకునేవారని వెంకయ్య నాయుడు చెప్పారు. తెలుగు ప్రజల గుండెల్లో ఏఎన్ఆర్ ఎప్పటికీ జీవించే వుంటారని ఆయన పేర్కొన్నారు. అక్కినేని జీవితం నుంచి నేటి యువత స్పూర్తి పొందాలని వెంకయ్య నాయుడు సూచించారు. ఇటీవల సినిమాల్లో వాడుతున్న భాష బాగుండటం లేదని, డబుల్ మీనింగ్ వచ్చేలా పదాలు వాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాజకీయం కంటే ప్రజలపై సినిమా ప్రభావం ఎక్కువని వెంకయ్య నాయుడు చెప్పారు.
తరలివచ్చిన సినీ ప్రముఖులు :
ఇకపోతే.. అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్, అల్లు అరవింద్, రాం చరణ్ , మహేశ్ బాబు, బ్రహ్మానందం, మురళీ మోహన్, శ్రీకాంత్, జగపతి బాబు, మంచు విష్ణు, దిల్‌రాజు, నాని, సుబ్బరామిరెడ్డి తదితరులు హాజరై ఏఎన్ఆర్తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com