Vande Bharat:తెలుగు రాష్ట్రాలకు ముచ్చటగా మూడో వందే భారత్.. సికింద్రాబాద్ నుంచే, రూట్ ఫిక్స్

  • IndiaGlitz, [Tuesday,April 11 2023]

దేశ ప్రజలకు వేగవంతమైన , సుఖవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. అన్ని ప్రాంతాల్లోనూ ఫుల్ ఆక్యూపెన్సీతో రైళ్లు నడుస్తున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 13 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు ప్రజలకు రైల్వే శాఖ మరో శుభవార్త చెప్పింది. త్వరలో సికింద్రాబాద్ నుంచి బెంగళూరుకు వందే భారత్ నడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హైదరాబాద్-బెంగళూరు మధ్య 570 కి.మీల దూరం:

ఇటీవల సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంపై నేతలకు ఓ సంకేతం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదే కనుక నిజమైతే బెంగళూరు, హైదరాబాద్ నగరాల మధ్య ప్రయాణించే వారు మరింత వేగంగా గమ్యస్థానాలను చేరవచ్చు. అంతేకాదు.. తెలుగు ప్రజలకు మూడు వందే భారత్‌లు ఇచ్చినట్లుగా అవుతుంది. ఇప్పటికే కాచిగూడ, సికింద్రాబాద్‌ల నుంచి బెంగళూరుకు పలు రైళ్లు తిరుగుతున్నాయి. హైదరాబాద్-బెంగళూరు నగరాల మధ్య 570 కి.మీల దూరం వుంటుంది. గమ్యస్థానాన్ని చేరుకోవడానికి 11 గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ మార్గంలో వందే భారత్ అందుబాటులోకి వస్తే మాత్రం 8 గంటల్లోనే గమ్యస్థానికి చేరుకోవచ్చు.

ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్‌ను ప్రారంభించిన మోడీ :

సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. వారంలో మంగళవారం తప్పించి మిగిలిన అన్ని రోజులు నడుస్తుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 8.30 గంటల్లో చేరుకుంటుంది. ప్రతిరోజూ ఈ రైలు సికింద్రాబాద్‌లో ఉదయం 6 గంటలకు బయల్దేరి.. మధ్యాహ్నం 14.30కి చేరుకుంటుంది. అలాగే తిరుపతిలో మధ్యాహ్నం 15.15కి బయల్దేరి రాత్రి 23.45కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. మధ్యలో నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరులలో ఆగుతుంది.

సికింద్రాబాద్- విశాఖ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ టైమింగ్స్ :

ఇకపోతే.. జనవరి 15న ప్రారంభమైన సికింద్రాబాద్- విశాఖ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ విషయానికి వస్తే వారంలో ఆదివారం మినహా మిగిలిన ఆరు రోజులు ఈ బండి నడుస్తుంది. విశాఖ నుంచి బయల్దేరే సమయంలో ప్రతిరోజూ ఉదయం 5.45 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్‌లో ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరి రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. రైలులో మొత్తం 14 ఏసీ ఛైర్ కార్లు, రెండు ఎగ్జిక్యూటివ్ ఏసీ ఛైర్ కార్ కోచ్‌లు వుంటాయి. మొత్తం 1128 మంది ఒకేసారి ప్రయాణించవచ్చు

More News

BRS Party:సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీలకు ఈసీ షాక్ : 'జాతీయ' పార్టీగా ఆప్.. బీఆర్ఎస్‌కు ఏపీలో గుర్తింపు రద్దు

మరికొద్దినెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ.. ప్రస్తుతం జాతీయ పార్టీలుగా వెలుగొందుతున్న తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల సంఘం షాకిచ్చింది.

Allu Arjun:సినీ జనాలకు షాకిచ్చిన అల్లు అర్జున్ : షారుఖ్ ‘‘జవాన్’’లో కీ రోల్‌.. సైలెంట్‌గా షూట్ పూర్తిచేశాడట..?

బాహుబలి సిరీస్ , పుష్ప, ఆర్ఆర్ఆర్ , కార్తీకేయ తదితర సినిమాలు బ్లాక్‌బస్టర్‌లు కావడం.

Natti Kumar :కొందరికి తెలియదు, కొందరినీ పిలవలేదు.. ఆస్కార్ విజేతలను ఇలాగేనా గౌరవించేది : నట్టి కుమార్ ఆరోపణలు

తెలుగు చిత్ర సీమ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది ఆర్ఆర్ఆర్. టాలీవుడ్‌ కలలో కూడా ఊహించని ఆస్కార్ అవార్డ్‌ని ముద్దాడి దేశానికి కానుక ఇచ్చారు ఎస్ఎస్ రాజమౌళి.

Radhika Apte : హీరోల రెమ్యూనరేషన్‌పై రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు

రాధికా ఆప్టే.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు.

Pawan Kalyan:పవన్ చేతికి తాబేలు ఉంగరం గమనించారా.. ఈసారి జనసేనాని జ్యోతిష్యాన్ని నమ్ముకున్నారా..?

పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో ఫుల్ బిజీ. చేతిలో వున్న సినిమాలను పూర్తి చేసి 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం