చిరు ‘లూసిఫర్’ నుంచి మరో అప్‌డేట్

  • IndiaGlitz, [Friday,January 01 2021]

మోహ‌న్ లాల్ న‌టించిన మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్టర్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌‌లో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న విషయం తెలిసిందే. చిరంజీవి 153వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా అప్‌డేట్ కోసం చిరు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకూ దర్శకుడి విషయంలో సస్పెన్స్ కొనసాగింది. ఈ సినిమా రీమేక్ కోసం ఎందరో దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే ఫైనల్‌గా సినిమాకు దర్శకుడు ఫిక్స్ అయ్యారు. ‘త‌నిఒరువ‌న్’ ఫేం మోహ‌న్ రాజా ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నారు.

కాగా.. ఈ సినిమాలో సత్యదేవ్‌కు అవకాశం దక్కిందని సమాచారం. ‘లూసిఫర్’ రీమేక్‌లో ఓ కీలక పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్ సమయంలో తన నటన ద్వారా మంచి నేమ్, ఫేమ్‌ను సత్యదేవ్ సంపాదించుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో సత్యదేవ్ నటించిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ ఓటీటీ ద్వారా విడుదల అయ్యింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను సైతం పొందింది. ఈ సినిమా మంచి టాక్‌ను సంపాదించుకుంది. దీంతో సత్యదేవ్ లాక్‌డౌన్ స్టార్‌గా మారిపోయారు. దీంతో ఆయనకు వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా చిరు సినిమాలో ఛాన్స్ కొట్టేయడంతో ఇది ఆయన కెరీర్‌గా అదిరిపోయే టర్నింగ్ పాయింట్ కానుంది.

More News

పండంటి పాపకు జన్మనిచ్చిన ‘విశ్వరూపం’ ఫేమ్

‘విశ్వరూపం’ ఫేమ్ పూజా కుమార్ గుర్తుందా? ఆమెకు తాజాగా పండంటి పాప పుట్టింది. కొంత కాలం క్రితం ఎన్ఆర్ఐ విశాల్ జోషిని పూజా కుమార్ వివాహం చేసుకున్నారు. తాజాగా ఈ దంపతులకు పాప పుట్టింది.

నితిన్, కీర్తి సురేష్ ల 'రంగ్ దే' మార్చి 26న విడుదల

యూత్ స్టార్ 'నితిన్', 'కీర్తి సురేష్' ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ' సితార ఎంటర్ టైన్మెంట్స్' నిర్మిస్తున్న చిత్రం ఈ 'రంగ్ దే'. 'ప్రతిభగల యువ దర్శకుడు 'వెంకీ అట్లూరి'

క్లైమాక్స్‌లో గోపీచంద్ 'సీటీమార్‌'

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘సీటీమార్‌’.

'క్రాక్‌' ట్రైలర్‌.. పక్కా మాస్‌

మాస్‌ మహారాజా రవితేజ సినిమా ఉండాలని ఆయన అభిమానులు కోరుకుంటారో అలాంటి మాస్‌ అండ్‌ యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో రూపొందిన చిత్రం 'క్రాక్‌'..

కరోనాతో వైసీపీ ఎమ్మెల్సీ మృతి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారితో వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి చెందారు. గత నెల 13న కరోనా చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు.