టీవీ9 కేసులో ట్విస్ట్లే ట్విస్ట్‌లు.. ఢిల్లీలో ఏం జరగబోతోంది!?
Send us your feedback to audioarticles@vaarta.com
టీవీ9 కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. గురువారం రవిప్రకాష్ వేసిన పిటీషన్‌కు అర్హత లేదంటూ అలందా మీడియా ఢిల్లీలోని నేషనల్ కంపెనీ..' కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్' (ఎన్సీఎల్ఏటీ)ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై వాదనలు విన్న అప్పిలేట్ ట్రిబ్యునల్ జూలై 9 వరకు స్టేను విధించింది. దీంతో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పిటీషన్‌ను స్వీకరించలేనంటూ హైదరాబాద్ ఎన్సీఎల్టి న్యాయమూర్తి అనంత పద్మనాభ స్వామి తేల్చి చెప్పేశారు. అయితే వాదనలు వినడానికి జూలై 12వ తేదీకి కేసు వాయిదా వేయడం జరిగింది. ఇదిలా ఉంటే.. అప్పటికీ స్టేను ఎత్తి వేయకపోతే కేసును అడ్మిట్ చేయడం సాధ్యం కాదని తేలిపోయింది. దీంతో రవిప్రకాష్ చేసిన చివరి ప్రయత్నమూ విఫలం అయినట్లు అయ్యింది. సో.. మొత్తానికి చూస్తే రవిప్రకాష్ ప్రయత్నాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయన్న మాట.
రవి ప్రకాష్‌కు కోలుకోలేని షాక్!
రవిప్రకాష్‌తో పాటు క్లిఫ్టార్డ్, మూర్తిలు రెస్పాండెంట్లుగా పిటిషన్‌ను దాఖలు చేయడం జరిగింది. అయితే క్లిఫర్డ్ తరపు న్యాయవాది తన క్లయింట్ అనుమతి లేకుండానే పిటిషన్‌ను రవిప్రకాష్ దాఖలు చేశారని ఎన్సీఎల్టీ న్యాయమూర్తికి తెలపడం గమనార్హం. దీంతో రవిప్రకాష్ దాదాపుగా ఒంటరి అయినట్టే.! అలందా మీడియా ముందుగానే ఈ విషయాన్ని పసిగట్టి స్టే తెచ్చుకున్నట్టుగానే.. రవిప్రకాష్ కూడా అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో కేవియట్ పిటిషన్‌ను దాఖలు చేసినట్లయితే పరిస్థితి మరో విధంగా ఉండేదని నిపుణాలు చెబుతున్నారు. కాగా ప్రస్తుతానికి టీవీ9 కేసు ఢిల్లీకి బదిలీ అయింది. ఢిల్లీలో ఏం జరగబోతోంది..? రవిప్రకాష్ బయటపడతారా..? లేకుంటే మరిన్ని చిక్కుల్లో పడతారా..? అనేది తెలియాలంటే.. జూలై 12 వరకు వేచి చూడాల్సిందే మరి.
ఇది నిజమేనా..!?
కాగా.. ఈ టీవీ9 వ్యవహారానికి సంబంధించి 'శక్తి' అనే వ్యక్తితో రవి ప్రకాశ్ ఇతరులు చేసిన ఈ-మెయిల్స్‌ను సైబర్ క్రైం పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎలాంటి ఆధారాలు లభ్యం కాకుండా చూడటం కోసం వీరంతా ఈ-మెయిల్స్‌ను డిలీట్ చేశారని తెలుస్తోంది. కానీ టెక్నాలజీ సాయంతో పోలీసులు ఆ సమాచారాన్ని పొందగలిగారని తెలుస్తోంది. అయితే అందులో ఏమున్నాయ్..? పోలీసులు చేతికి కీలక సమా చారం అందిందా..? అనేదానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments