ఏపీలో తప్పిన రైలు ప్రమాదం.. గేట్మెన్ నిర్లక్ష్యం, ఈ లోకో పైలట్ నిజంగా దేవుడే
Send us your feedback to audioarticles@vaarta.com
ఒడిషాలోని బాలేశ్వర్ జిల్లా బహనాగ్ బజార్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 300 మంది మరణించడంతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. ఈ ప్రమాదంతో దేశవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇటీవలికాలంలో ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇదే తొలిసారి. ఈ ప్రమాదంలో మరణించిన, గాయాలైనవారిలో ఒడిషా, బెంగాల్ వాసులే అధిక సంఖ్యలో వున్నారు. అయితే దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, తమిళనాడు వాసులు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ప్రమాదంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి అండగా వుంటామని తెలిపారు.
గేట్మెన్ నిర్లక్ష్యంతో ట్రాక్‌పైకి జనం:
సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో మరో రైలు ప్రమాదం వెంట్రుక వాసిలో తప్పిపోయింది. అది కూడా ఎక్కడో కాదు.. మన ఆంధ్రప్రదేశ్‌లోనే. వివరాల్లోకి వెళితే.. శ్రీసత్యసాయి జిల్లా కదిరి రైల్వే స్టేషన్ సమీపంలోని కూటాగుళ్ల వద్ద రైల్వే సిబ్బంది గేటును వేయలేదు. సరిగ్గా అదే సమయంలో నాగర్‌కోయిల్-ముంబై రైలు ఆ మార్గంలో వస్తోంది. అయినప్పటికీ జనం ట్రాక్‌పై అటు ఇటు తిరిగారు. అయితే కొందరు స్థానికులు రైలు రాకను గమనించి వెంటనే తమ వాహనాలను నిలిపివేశారు. కానీ కొందరు నిర్లక్ష్యంగా ట్రాక్ దాటేందుకు ప్రయత్నించారు. వీరిని గమనించిన లోకో పైలట్ తక్షణం స్పందించి రైలును నిలిపివేశారు.
లోకో పైలట్ సమయస్పూర్తి :
ఆపై రైలును దిగి అక్కడి గేట్‌మ్యాన్ రూమ్‌కి వెళ్లిన లోకో పైలట్.. లోపల ఎవరైనా వున్నారేమోని చూశారు. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో వాకీటాకీ ద్వారా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు . దీనిని చూసిన స్థానికులు గేట్మెన్ సకాలంలో స్పందించకుంటే పెను ప్రమాదం జరిగేదని చెబుతున్నారు. దీనిపై స్పందించిన రైల్వే అధికారులు విచారణ జరుపుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com