చిరు టైటిల్ పై మరో వార్త...ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది...
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి, వినాయక్‌ల కాంబినేషన్‌లో రూపొందుతోన్న 150వ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాకు ముందు కత్తిలాంటోడు అనే టైటిల్‌ను రిజిష్టర్ చేయించారు. కానీ ఇప్పుడు టైటిల్ మారుతుంది. ఓ వారం ముందు చిరంజీవి కొత్త టైటిల్ ఖైదీ నెం 150 అనే టైటిల్ పరిశీలనలో ఉందని అన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా ఈ చిత్రానికి నెపోలియన్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదేనంటూ ఓ పోస్టర్ కూడా ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతుంది. మరి ఇది నిజంగా యూనిట్ అనుకుంటున్న టైటిలా లేక ఎవరైనా ఫ్యాన్ మేడ్ పోస్టరా అని తెలియాలంటే చిత్రయూనిట్ ఎలా స్పందించాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com