పరిశీలనలో మరో టైటిల్

  • IndiaGlitz, [Tuesday,August 13 2019]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ సినిమా టైటిల్‌ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న అనౌన్స్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా టైటిల్ విషయంలో ఎప్పటి నుండో చాలా పేర్లు వినపడుతున్నాయి.

'పార్థు', 'అలకనంద', 'నాన్న నేను' పేర్లు టైటిల్‌గా పెట్టే అవకాశం ఉందని అన్నారు. అయితే తాజాగా.. మరో టైటిల్ కూడా వార్తల్లోకి వచ్చింది. బన్నీ తదుపరి చిత్రానికి 'వైకుంఠపురంలో..' అనే టైటిల్‌ను కూడా అనుకుంటున్నారట. మరి అసలు యూనిట్ ఫిక్స్ అయిన టైటిల్ ఏంటో తెలియాలంటే ఆగస్ట్ 15 వరకు ఆగాల్సిందే.

బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటిస్తుంది. సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

More News

హాట్ భామ సీక్రెట్ పెళ్లి.. 4 కోట్లివ్వాలని మాజీ ప్రియుడు డిమాండ్

బాలీవుడ్ సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్.. ఎన్నారై రితీశ్‌ను వివాహమాడిన విషయం తెలిసిందే.

నా కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమా..‘రణరంగం-2’ కూడా: సుధీర్ వర్మ

హీరో శర్వానంద్, కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్‌ నటీనటులుగా సుధీర్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘రణరంగం’.

త‌మిళ్ రాక‌ర్స్‌కు ఢిల్లీ హై కోర్ట్ షాక్‌

త‌మిళ చిత్ర‌సీమ‌ను పైర‌సీ వెబ్ సైట్ త‌మిళ్ రాక‌ర్స్ చాలా పెద్ద ఇబ్బందికే గురి చేస్తూ వ‌చ్చింది.

కాస్త డిఫరెంట్‌గా జంట నామినేషన్.. ఔటయ్యేదెవరో!

తెలుగు రియాల్టీ బిగ్‌బాస్ సీజన్-3లో మూడు వారాల పాటు ఒక్కొక్కరినే ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్ ఇక నుంచి కాస్త డిఫరెంట్‌గా ఇద్దర్ని ఎలిమినేట్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

బిగ్ బాస్ సీజన్-3: రియల్‌ కపుల్స్‌ ఒకే బెడ్‌పై ముచ్చట్లు..!

తెలుగు రియాల్టీ బిగ్‌బాస్ సీజన్-3 రోజురోజుకు రక్తి కట్టిస్తోంది. మొదటి మూడు వారాలు విజయంతంగా సాగగా ముగ్గురు హౌస్ నుంచి ఓటయ్యారు.