పవన్ 27 కోసం మరో టైటిల్?
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్‌సాబ్’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ కాగానే కరోనా వైరస్ ప్రభావం ప్రబలడంతో సినిమా షూటింగ్‌ను అపేశారు. మరో వైపు ‘వకీల్‌సాబ్’ 80 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. పరిస్థితులు చక్కబడిన తర్వాత ఈ రెండు సినిమాల షూటింగ్స్‌ను స్టార్ట్ చేసుకోవడానికి పవన్ సిద్ధంగా ఉన్నారు.
పవన్ కల్యాణ్ 27వ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సోషల్ మీడియాలో కొన్ని రోజుల ముందు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు ‘బందిపోటు’, ‘గజదొంగ’ అనే టైటిల్స్ కూడా పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా నటించనుందని వార్తలు షికార్లు చేస్తున్నాయి. షూటింగ్స్ స్టార్ట్ అయితే ముందు ‘వకీల్‌సాబ్’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి తర్వాత క్రిష్ సినిమాను పవన్‌కల్యాణ్ ప్రారంభిస్తాడని అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments