మహేష్ సినిమాలో మరో తమిళ నటుడు...

  • IndiaGlitz, [Monday,December 12 2016]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ప్ర‌స్తుతం అహ్మ‌దాబాద్‌లో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. డిసెంబ‌ర్ 24వ‌ర‌కు జ‌రిగే అహ్మ‌దాబాద్ షెడ్యూల్‌తో సినిమా 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. ఎన్‌.వి.ప్ర‌సాద్‌, ఠాగూర్ మ‌ధు నిర్మాత‌లుగా రూపొందుతోన్న ఈ సినిమాకు 'సంభ‌వామి' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్‌ను జ‌న‌వ‌రిలో విడుద‌ల చేసేలా నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

అహ్మ‌దాబాద్ షెడ్యూల్ త‌ర్వాత త‌దుప‌రి షెడ్యూల్‌ను జ‌న‌వ‌రి 3 నుండి హైద‌రాబాద్‌లో షూట్ చేస్తారు. రెండు సాంగ్స్ మిన‌హా ఈ షెడ్యూల్‌లో చిత్రీక‌ర‌ణను పూర్తి చేస్తారు. ఈ రెండు సాంగ్స్‌లో ఒక సాంగ్‌ను విదేశాల్లో చిత్రీక‌రిస్తారు. ఈ చిత్రంలో ఓ బాయ్స్ ఫేమ్ భ‌ర‌త్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అల్రెడి ఈ చిత్రంలో త‌మిళ ద‌ర్శ‌కుడు ఎస్‌.జె.సూర్య విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో మ‌హేష్ ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నాడు.