'ఆదిపురుష్' నుండి మరో సర్‌ప్రైజ్ వచ్చేసింది
Send us your feedback to audioarticles@vaarta.com
రెబెల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఆయన చేస్తున్న సినిమాలన్నీ ప్యాన్ ఇండియా మూవీలే. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ దక్షిణాదిన పెద్ద సక్సెస్ కాకపోయినప్పటికీ ఉత్తరాదిన మాత్రం భారీ విజయాన్ని దక్కించుకుంది. దీంతో ప్రభాస్ చేస్తున్న తాజా చిత్రాలన్నీ ప్యాన్ ఇండియా చిత్రాలుగానే రూపొందుతున్నాయి. అందులో ఓం రావుత్ దర్శకత్వంలో రామాయణంను ‘ఆదిపురుష్’ అనే పేరుతో ఓంరౌత్ తెరకెక్కిస్తున్నాడు. గురువారం ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ మరో సర్‌ప్రైజ్‌ను ఇచ్చింది.
సినిమాను 2022 ఆగస్ట్ 11న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రభాస్ ఇందులో రాముడిగా నటిస్తుంటే, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణాసురుడు పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సీత పాత్రలో ఎవరు నటిస్తారనే ఆసక్తికరమైన అంశంగా మారింది. వచ్చే ఏడాది సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. సీజీ వర్క్ సినిమాలో కీలక భూమికను పోషించనుంది. మూడు వందల కోట్లరూపాయలకు పై బడ్జెట్‌తో త్రీడీ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓంరావుత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com