'ఎఫ్ 2' సీక్వెల్ లో మరో స్టార్ హీరో
Send us your feedback to audioarticles@vaarta.com
గత ఏడాది దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఎఫ్ 2`. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రమిది. గత సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్3ని తెరకెక్కిస్తామని దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్‌రాజు తెలియజేసిన సంగతి తెలిసిందే.
అయితే తర్వాత అనిల్ రావిపూడికి సూపర్ స్టార్ మహేశ్‌ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి మహేశ్‌తో చేసిన `సరిలేరు నీకెవ్వరు` సినిమా కూడా విజయం సాధించింది. ఈనేపథ్యంలో సీక్వెల్ ఎఫ్ 3 మరోసారి తెరపైకి వచ్చింది. సినీ వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నాడట.
వెంకటేశ్, వరుణ్ తేజ్‌లతో పాటు మరో స్టార్ హీరో కూడా ఈ సీక్వెల్లో నటిస్తాడని వార్తలు వినపడుతున్నాయి. ఆ స్టార్ ఎవరో కాదు.. రవితేజ. ఇప్పటికే రవితేజ ఈ సినిమా గురించి డైరెక్టర్ అనిల్ చర్చలు కూడా జరిపాడని సమాచారం. మరి రవితేజ సినిమా చేయడానికి ఒప్పుకుంటాడో లేదో.. చేస్తే ఈసారి అనిల్ తనదైన స్టైల్లో ఎలా మెప్పిస్తాడో చూడాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com