గోపీచంద్‌తో మరో స్టార్ హీరోయిన్..?
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ డైరెక్టర్ తేజ ... ఒకప్పుడు చిత్రం, నువ్వు నేను, జయం వంటి ప్రేమకథా చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నాడు. లవ్‌స్టోరీస్‌ను తెరకెక్కించడంలో దిట్టగా పేరు సంపాదించుకున్నాడు. అయితే ఆ తర్వాత సక్సెస్‌లను సాధించడంలో వెనుకబడ్డాడు. ఇక తేజ అనే డైరెక్టర్ లేడేమో అని అనుకుంటున్న సమయంలో `నేనే రాజు నేనే మంత్రి` సినిమాతో సక్సెస్ సాధించి మళ్లీ తన ఉనికిని చాటుకున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ `యన్.టి.ఆర్`ను తెరకెక్కించాల్సింది కానీ.. ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. కానీ తర్వాత తేజ తెరకెక్కించిన `సీత` బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఈయన తదుపరి సినిమాలపై పలు వార్తలు వచ్చాయి.
అయితే తెలుగులో రానాతో ఓ సినిమా, గోపీచంద్‌తో మరో సినిమాను తెరకెక్కించే పనిలో తేజ బిజీగా ఉన్నాడు. ఇందులో గోపీచంద్‌తో అలివేలుమంగ వేంకటరమణ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలనే దానిపై తేజ చాలా కసరత్తే చేశాడట. అనుష్క, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు ప్రముఖంగా వినపడ్డాయి. తాజాగా ఈ లిస్టులో కీర్తిసురేశ్ పేరు చేరింది. మరి తేజ దర్శకత్వంలో కీర్తి ఓకే చెబుతుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com