బాలీవుడ్‌లోకి మ‌రో సౌత్ మూవీ...

  • IndiaGlitz, [Saturday,August 25 2018]

బాలీవుడ్ చిత్రాల‌కు ధీటుగా ఇటు మేకింగ్‌లో.. కాన్సెప్ట్ ప‌రంగా సౌత్ సినిమాలు వ‌స్తున్నాయి. దీంతో బాలీవుడ్ మేక‌ర్స్ ద‌క్షిణాది సినిమాల‌పై ఆస‌క్తిని చూపుతున్నారు. ఇటీవ‌ల సంజ‌య్ లీలా బ‌న్సాలి త‌మిళంలో విజ‌యవంత‌మైన క‌త్తి సినిమా హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నారు.

తాజాగా మ‌రో ద‌క్షిణాది సినిమా హ‌క్కుల‌ను బాలీవుడ్ హీర సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ద‌క్కించుకున్నాడ‌ట‌. కుదిరితే తానే స్వ‌యంగా ఆ సినిమాను నిర్మించాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. ఇంత‌కు ఆ సినిమా మ‌రేదో కాదు.. మ‌ల‌యాళంలో ఘన విజ‌యం సాధించిన 'బెంగ‌ళూర్ డేస్'. దుల్క‌ర్ స‌ల్మాన్‌, నివీన్ పౌలీ, న‌జ్రియా న‌జీమ్‌, ఫ‌హాద్ ఫాజిల్‌, నిత్యామీన‌న్ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు.