బాలీవుడ్‌లోకి మరో దక్షిణాది సినిమా ..!
Send us your feedback to audioarticles@vaarta.com
మారుతున్న ప్రేక్షకుల అభిరుచి అనుగుణంగా ఉత్తరాది దర్శక నిర్మాతలు మన దక్షిణాదిన సెన్సేషనల్ హిట్ అయిన సినిమాలను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి తెలుగు నుండి కబీర్ సింగ్ పేరుతో ఉత్తరాదిన రీమేక్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు జెర్సీ సహా మరికొన్ని సినిమాలు బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో మరో దక్షిణాది సినిమాపై బాలీవుడ్ మేకర్స్ కన్నేశారట. ఆ సినిమా ఏదో కాదు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమా. ఈ సంక్రాంతికి తెలుగు, తమిళంలో విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లను సాధిస్తుంది. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ సంక్రాంతి పండుగ కావడం, విజయ్‌కు ఉన్న ఫ్యాన్ బేస్, కోవిడ్ తర్వాత వచ్చిన విజయ్ సినిమా కావడం వంటి కారణాలతో మాస్టర్ వసూళ్లు బాక్సాఫీస్ వద్ద భారీగానే ఉన్నాయి.
ఇప్పుడు బాలీవుడ్‌లో 'మాస్టర్'ను రీమేక్ చేస్తే ఎవరితో చేస్తారనే దానిపై కూడా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. హీరో విజయ్ పాత్రలో హృతిక్ రోషన్.. విజయ్ సేతుపతి పాత్రను తనతోనే చేయించాలని మేకర్స్ అనుకుంటున్నారట. విజయ్ సేతుపతి చేసిన పాత్రను తనతోనే ఎందుకు చేయించాలనుకుంటున్నారంటే.. ఈ సినిమా నిర్మాణ దశలో ఉండగానే విజయ్ సేతుపతి బాలీవుడ్‌లో చేస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులకు దగ్గరవుతాడు. దాంతో విజయ్ సేతుపతి ఎవరు? అని బాలీవుడ్ ప్రేక్షకులు ఆలోచించరు. కాబట్టి.. మాస్టర్‌లో విజయ్ సేతుపతి పాత్రను తనతోనే చేయిస్తారట. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే క్లారిటీ వస్తుందని అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments