బాలీవుడ్‌లోకి మరో దక్షిణాది సినిమా ..!

  • IndiaGlitz, [Saturday,January 16 2021]

మారుతున్న ప్రేక్షకుల అభిరుచి అనుగుణంగా ఉత్తరాది దర్శక నిర్మాతలు మన దక్షిణాదిన సెన్సేషనల్‌ హిట్‌ అయిన సినిమాలను బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారు. అర్జున్‌ రెడ్డి తెలుగు నుండి కబీర్‌ సింగ్‌ పేరుతో ఉత్తరాదిన రీమేక్‌ అయ్యి ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు జెర్సీ సహా మరికొన్ని సినిమాలు బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో మరో దక్షిణాది సినిమాపై బాలీవుడ్‌ మేకర్స్‌ కన్నేశారట. ఆ సినిమా ఏదో కాదు. కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ నటించిన మాస్టర్‌ సినిమా. ఈ సంక్రాంతికి తెలుగు, తమిళంలో విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లను సాధిస్తుంది. మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినప్పటికీ సంక్రాంతి పండుగ కావడం, విజయ్‌కు ఉన్న ఫ్యాన్‌ బేస్‌, కోవిడ్‌ తర్వాత వచ్చిన విజయ్‌ సినిమా కావడం వంటి కారణాలతో మాస్టర్‌ వసూళ్లు బాక్సాఫీస్‌ వద్ద భారీగానే ఉన్నాయి.

ఇప్పుడు బాలీవుడ్‌లో 'మాస్టర్‌'ను రీమేక్‌ చేస్తే ఎవరితో చేస్తారనే దానిపై కూడా వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. హీరో విజయ్‌ పాత్రలో హృతిక్‌ రోషన్‌.. విజయ్‌ సేతుపతి పాత్రను తనతోనే చేయించాలని మేకర్స్‌ అనుకుంటున్నారట. విజయ్‌ సేతుపతి చేసిన పాత్రను తనతోనే ఎందుకు చేయించాలనుకుంటున్నారంటే.. ఈ సినిమా నిర్మాణ దశలో ఉండగానే విజయ్‌ సేతుపతి బాలీవుడ్‌లో చేస్తున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకులకు దగ్గరవుతాడు. దాంతో విజయ్‌ సేతుపతి ఎవరు? అని బాలీవుడ్ ప్రేక్షకులు ఆలోచించరు. కాబట్టి.. మాస్టర్‌లో విజయ్‌ సేతుపతి పాత్రను తనతోనే చేయిస్తారట. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే క్లారిటీ వస్తుందని అంటున్నారు.

More News

మరో అందం వెనుక అసలు కారణం చెప్పిన మంచు హీరో.. మహేశ్‌ రిప్లై

టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేశ్‌ హ్యండ్‌సమ్‌ నెస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వయసు పెరుగుతున్న కొద్దీ మహేశ్‌ యంగ్‌గా మారిపోతున్నాడు.

నిర్మాతను హర్ట్‌ చేసిన నమ్రత శిరోద్కర్‌

మాజీ హీరోయిన్‌, మహేశ్‌ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌ ఓ నిర్మాతను హార్ట్‌ చేసిందా? కావాలనే అలా జరిగిపోయిందో తెలియదు కానీ..

పీఎం నుంచి సీఎం వరకూ ఒక్కరూ ముందుకు రారే.. వీళ్లవేనా ప్రాణాలు?

ఏడాది కాలంగా ప్రజానీకాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారికి మందు వచ్చేసింది. నేటి నుంచి దేశ వ్యాప్తంగా చాలా ప్రతిష్టాత్మకంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

వెనక్కి తగ్గిన వాట్సాప్.. కొత్త ప్రైవసీ పాలసీ విధానం వాయిదా..

కొత్త ప్రైవసీ పాలసీపై ప్రఖ్యాత మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెనక్కి తగ్గింది. మూడు నెలల పాటు దీనిని వాయిదా వేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.

`ప‌వ‌ర్ ప్లే` ఫ‌స్ట్‌లుక్, మోష‌న్ పోస్ట‌ర్‌

యంగ్ హీరో రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న లేటెస్ట్ మూవీ `పవర్ ప్లే`.