వైసీపీలోకి మరో సిట్టింగ్ ఎంపీ

  • IndiaGlitz, [Monday,February 18 2019]

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌‌లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు 'బ్యాడ్ టైమ్' స్టార్ట్ అయ్యిందని స్పష్టంగా అర్థమవుతోంది!. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌‌లు టీడీపీకి టాటా చెప్పేసి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో ఎంపీ పండుల రవీంద్ర బాబు టీడీపీకి గుడ్‌‌బై చెప్పేశారు. కాగా ఈయన.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అమలాపురం నుంచి లోక్‌‌సభ ఎంపీగా 2014లో టీడీపీ తరఫున గెలుపొందారు. సోమవారం మధ్యా్హ్నం, మంగళవారం వైసీపీ అధినేత వైఎస్‌‌ జగన్ మోహన్ రెడ్డిని.. ఎంపీ కలవనున్నారు. ఈ సందర్భంగా పోటీ ఎక్కడ్నుంచి అనే విషయంపై చర్చించనున్నారని తెలుస్తోంది.

అసలేం జరిగింది..

త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన రవీంద్రబాబు టీడీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారని ఆయన అనుచరులు, ముఖ్య కార్యకర్తలు చెబుతున్నారు. గోదావరి జిల్లాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని రవీంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఆయన్ను సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. కాగా.. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరిన తర్వాత.. రవీంద్రబాబు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు రావడంతో ఆయన ఈ వార్తలను తీవ్రంగా ఖండించారు. తాను టీడీపీని వీడే ప్రసక్తే లేదని.. సీఎం చంద్రబాబుపై పూర్తి విశ్వాసం తనకుందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

కాగా.. 2014 ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలే వైసీపీకి గట్టిగా దెబ్బేశాయి. ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడంతో జగన్‌‌ సీఎం సీటును కోల్పోవడం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ తరుణంలో టీడీపీ అసంతృప్తులందర్నీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉండే కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తూ పార్టీని రోజురోజుకు బలోపేతం చేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

More News

పాక్ క‌ళాకారుల‌ను బ్యాన్ చేసిన బాలీవుడ్‌

పుల్వామా ఉగ్ర‌దాడి ఫ‌లితం పాక్‌పై చాలా బాగానే ప్ర‌భావం చూపుతుంది. ఒక‌వైపు రాజకీయ ఒత్తిళ్ల‌ను పాకిస్థాన్ ఎదుర్కొంటుంది. ఇప్పుడు సినిమా రంగం.. బాలీవుడ్ కూడా పాకిస్థానీ క‌ళాకారుల‌ను బ్యాన్ చేసింది.

రీమేక్ ఆలోచ‌న‌లో అల్లు అర‌వింద్‌

టాలీవుడ్ ఏస్ ప్రొడ్యూస‌ర్స్‌లో ఒక‌రైన అల్లు అర‌వింద్.. రీసెంట్‌గా విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసుకుంటున్న గ‌ల్లీబాయ్స్ చిత్రాన్ని తెలుగులో

వ‌రుణ్ చిత్రంలో కోలీవుడ్ హీరో...

హృద‌యం సినిమా పేరు వినే ఉంటారు. ఆ సినిమా హీరో ముర‌ళి. ఆయ‌న త‌న‌యుడు అధ‌ర్వ ముర‌ళి త‌మిళంలో హీరోగా రాణిస్తున్నాడు.

మ‌హేష్ 'వాట్సాప్‌'

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా త‌దుప‌రి సినిమాకు రంగం సిద్ధ‌మ‌వుతోంది.

కార్తి తెలుగు చిత్రం

హీరో సూర్య సోద‌రుడిగా సినిమా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యమైనా  ఆవారా, నా పేరు శివ వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు హీరో కార్తి.