చరణ్ లో మరో కోణం
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన చిత్రం బ్రూస్ లీ ద ఫైటర్`. శ్రీనువైట్ల దర్శకత్వంలో దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా అక్టోబర్ 16న విడుదలవుతుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ అప్పియరెన్స్ చేస్తున్నాడు. దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత చిరంజీవి చేస్తున్న చిత్రం కావడంతో మెగాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో చిరంజీవి నటించడం గురించి హీరో చరణ్ ని అడిగితే ఉదయం ఏడు గంటలకంతా స్పాట్ ను చేరుకుని చిరంజీవికి మేకప్ చేశాడట. ఈ విషయాన్ని చరణ్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశాడు. హీరోగానే కాకుండా త్వరలోనే నిర్మాతగా మారనున్న చరణ్ లో మరో కోణం ఈ చిత్రంతో బయటకు వచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments