రియాకు మరో షాక్...
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ సుశాంత్ రాజ్‌పుత్ ప్రియురాలికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆమె డ్రగ్స్ కేసులో రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి అరెస్ట్ అయి రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. బెయిల్ కోసం ముంబై ప్రత్యేక కోర్టులో వీరివురూ పిటషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్లను ముంబై కోర్టు తిరస్కరించింది. అలాగే రియా, షోవిక్‌లతో పాటు ఇప్పటికే ఎన్‌సీబీ అదుపులో ఉన్న అబ్దుల్ బాసిత్, జైద్ విలత్రా, సావంత్, శామ్యూల్ మిరండా బెయిల్ పిటిషన్లను కూడా ముంబై కోర్టు తిరస్కరించింది.
రియా అరెస్ట్ అనంతరం.. ఆమె లాయర్ స్పందిస్తూ మాదక ద్రవ్యాలకు బానిసై మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తిని ప్రేమించినందునే రియాకు ఈ దుస్థితి పట్టిందన్నారు. ప్రేమించడం ఆమె చేసిన నేరమైతే.. దాని పరిణామాలను ఎదుర్కోవడానికి రియా సిద్ధంగా ఉందన్నారు. కాగా.. తాను అమాయకురాలినని.. ఎటువంటి తప్పూ చేయలేదని.. తనను తప్పుడు ఆరోపణలతో ఇరికించారని రియా పిటిషన్‌లో పేర్కొంది. అయినప్పటికీ కోర్టు రియా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.
కాగా.. రియాకు డ్రగ్స్ కేసులో సెప్టెంబర్ 22 వరకూ కోర్టు ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో ఆమెను బైకుల్లా జైలులో ఉంచనున్నారు. రియాను ఎన్‌సీబీ మూడు రోజుల పాటు విచారించింది. ఈ విచారణలో రియా తాను సుశాంత్‌కు డ్రగ్స్ అందించినట్లు అంగీకరించింది. దీంతో మూడో రోజున రియాను ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments