రియాకు మరో షాక్...

  • IndiaGlitz, [Friday,September 11 2020]

బాలీవుడ్ సుశాంత్ రాజ్‌పుత్ ప్రియురాలికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆమె డ్రగ్స్ కేసులో రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి అరెస్ట్ అయి రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. బెయిల్ కోసం ముంబై ప్రత్యేక కోర్టులో వీరివురూ పిటషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్లను ముంబై కోర్టు తిరస్కరించింది. అలాగే రియా, షోవిక్‌లతో పాటు ఇప్పటికే ఎన్‌సీబీ అదుపులో ఉన్న అబ్దుల్ బాసిత్, జైద్ విలత్రా, సావంత్, శామ్యూల్ మిరండా బెయిల్ పిటిషన్లను కూడా ముంబై కోర్టు తిరస్కరించింది. 

రియా అరెస్ట్ అనంతరం.. ఆమె లాయర్ స్పందిస్తూ మాదక ద్రవ్యాలకు బానిసై మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తిని ప్రేమించినందునే రియాకు ఈ దుస్థితి పట్టిందన్నారు. ప్రేమించడం ఆమె చేసిన నేరమైతే.. దాని పరిణామాలను ఎదుర్కోవడానికి రియా సిద్ధంగా ఉందన్నారు. కాగా.. తాను అమాయకురాలినని.. ఎటువంటి తప్పూ చేయలేదని.. తనను తప్పుడు ఆరోపణలతో ఇరికించారని రియా పిటిషన్‌లో పేర్కొంది. అయినప్పటికీ కోర్టు రియా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.

కాగా.. రియాకు డ్రగ్స్ కేసులో సెప్టెంబర్ 22 వరకూ కోర్టు ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో ఆమెను బైకుల్లా జైలులో ఉంచనున్నారు. రియాను ఎన్‌సీబీ మూడు రోజుల పాటు విచారించింది. ఈ విచారణలో రియా తాను సుశాంత్‌కు డ్రగ్స్ అందించినట్లు అంగీకరించింది. దీంతో మూడో రోజున రియాను ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది. 

More News

న్యూలుక్‌తో సర్‌ప్రైజ్ చేసిన చిరు..

లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు ఏదో ఒక సర్‌ప్రైజ్ ఇస్తూ వస్తున్నారు. ఒకసారి చేపలకూర చేసి మెప్పిస్తే..

ఏపీలో కరోనా.. షాకింగ్ విషయాలు చెప్పిన 'సీరో' సర్వే..

కరోనా టెస్టులు అత్యధికంగా చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి.. ఇప్పటికే ఐదు లక్షలకు పై చిలుకు కేసులు ఏపీలో నమోదయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో చూపుతున్న బోగస్ లెక్కలు కూడా ఏపీలో చూపించట్లేదు.

బిగ్‌బాస్4: సస్పెన్స్‌లో పెట్టాల్సింది ఎవరిని? ఏంటీ కట్టప్ప గోల?

బిగ్‌బాస్ క్యాజువల్‌గానే ఇవాళ కూడా బోర్ కొట్టించింది. నిజానికి.. గత మూడు రోజులతో పోలిస్తే ఇవాళ మరింత బోర్ కొట్టించింది. దివి కంటెస్టెంట్లు అందరి గురించి తను వ్యూని వివరించడంతో షో స్టార్ట్ అయింది.

నటి శ్రావణి కేసు: దేవరాజు ఒక ప్లేబాయ్‌గా గుర్తించిన పోలీసులు

బుల్లితెర నటి శ్రావణి సూసైడ్ కేసు డైలీ సీరియల్‌ను మించిన మలుపులు తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి గంటకో కొత్త పేరు వెలుగు చూస్తోంది.

అక్టోబర్ 2న 'జీ 5' ఒరిజినల్ సిరీస్ 'ఎక్స్‌పైరీ డేట్' ప్రీమియర్

వెబ్ సిరీస్ ప్రారంభం నుండి శుభం కార్డు పడేవరకూ అనుక్షణం తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠకు గురిచేసే బెస్ట్ థ్రిల్లర్‌లను 'జీ 5' ఓటీటీ ప్రేక్షకులకు అందించింది.