రవితేజ 'ఖిలాడి'కి ఊహించని షాక్...
Send us your feedback to audioarticles@vaarta.com
‘క్రాక్’ సినిమాలో నటించి మంచి సక్సెస్ సాధించాడు హీరో రవితేజ. తన కమ్ బ్యాక్‌కు ఈ చిత్రం అద్భుతంగా తోడ్పడింది. ప్రస్తుతం ఇదే జోష్‌తో ‘ఖిలాడి’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ స్పీడ్‌కు కరోనా బ్రేక్ వేసింది. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ఇటలీలో మొదలైన సంగతి తెలిసిందే.
ఈ ఇటలీ షెడ్యూల్ దాదాపు పూర్తయ్యే తరుణంలో చిత్ర యూనిట్‌కు ఊహించని షాక్ తగిలింది. ఇటలీలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా అక్కడి ప్రభుత్వం ‘ఖిలాడి’ సినిమా షూటింగ్‌కు అనుమతులను నిలిపివేసిందని సమాచారం. దాంతో చిత్ర యూనిట్ ఏం చేయాలో తెలియక సందిగ్ధంలో ఉండిపోయిందని తెలుస్తోంది. లేటు అయినా పర్వాలేదు.. కొన్ని రోజులు అక్కడే ఉండి షూటింగ్‌ను పూర్తి చేసుకుని వస్తారా? లేక మిగిలిన షూటింగ్‌ను ఇక్కడి లొకేషన్స్‌లో ముగించే ప్లాన్ వేసుకుంటారా? అనేది చూడాలి.
హావీష్ ప్రొడక్షన్స్, బాలీవుడ్‌కు చెందిన పెన్ స్టూడియోస్ ‘ఖిలాడి’ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమిళంలో మంచి సక్సెస్ సాధించిన ఓ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో విలన్‌గా యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నట్టు చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించేసింది. ఈ సినిమాలో రవితేజ డ్యుయెల్ రోల్లో కనిపించనున్నట్టు సమాచారం. గతంలో కూడా రవితేజ డ్యుయెల్ రోల్లో నటించాడు. అయితే ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఈ సినిమా మే 28న విడుదల కాబోతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com