BRS Party: బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్‌ షాక్.. కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి

  • IndiaGlitz, [Saturday,November 25 2023]

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా హస్తం కండువా కప్పుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది సీనియర్ నేతలు కాంగ్రెస్‌లో చేరగా.. శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్మే అబ్రహం హస్తం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం బోథన్‌లో నిర్వహించనున్న సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన మండవ వెంకటేశ్వరరావు.. అప్పట్నుంచి ఆ పార్టీలోనే ఉన్నారు. అయితే పార్టీలో తగిన గుర్తింపు లేదని ఆయన గతకొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల మండవ వెంకటేశ్వరరావును టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కలిసి చర్చలు జరిపారు. కాంగ్రెస్‌లోకి రావాలంటూ ఆహ్వానించారు. దీంతో ఆయన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బోధన్, బాన్సువాడలో సెటిలర్లకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తారని మండవకు పేరుంది. దీంతో సెటిలర్లు కాంగ్రెస్ వైపు చూసే అవకాశముంది.

టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన మండవ వెంకటేశ్వరరావు డిచ్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1985లో తొలిసారి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1997లో చంద్రబాబు మంత్రివర్గంలో ఎక్సైజ్‌ శాఖమంత్రిగా పని చేశారు. 1999 ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు మంత్రివర్గంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా మూడేళ్ల పాటు పని చేసి, 2002లో విద్యాశాఖ మంత్రిగా భాద్యతలు నిర్వర్తించారు. 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న మండవ.. 2019లో గులాబీ పార్టీలో చేరారు.

More News

IT Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంట్లో రూ.40లక్షలు నగదు పట్టివేత

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఐటీ అధికారుల దాడులు కూడా వేగం పుంజుకున్నాయి. ఇటీవల వరుసగా కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు.

KCR: సీఎం కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరిక నోటీసులు

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. రెచ్చగొట్టే ప్రసంగాలపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. బాధ్యతాయుతమైన పదవి, పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా కొనసాగుతూ

Bigg Boss Telugu 7: ‘ ఒక్క ఛాన్స్ అన్నా.. శివాజీని వేడుకున్న అమర్‌దీప్, షాకిచ్చిన బిగ్‌బాస్.. తెగేదాకా లాగితే ఇంతే

బిగ్‌బాస్ సీజన్ 7 తెలుగు చివరి దశకు చేరుకుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ వుండగా.. ఈ సీజన్‌కు లాస్ట్ కెప్టెన్ ఎవరో ఈ వారం తేలిపోనుంది.

Modi: ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ సంచలన నిర్ణయం

తెలంగాణ ఎన్నికల వేళ ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాదిగలకు రిజర్వేషన్ ఫలాలు అందేలా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియకు కమిటీని ఏర్పాటుచేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Rythubandhu: రైతుబంధు నిధుల విడుదల.. బీఆర్ఎస్‌కు లాభం చేకూరనుందా..?

తెలంగాణ ఎన్నికలకు నాలుగు రోజుల ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీ ఊరట దక్కింది. రైతుబంధు నిధుల విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.