BRS Party: బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్.. కాంగ్రెస్లోకి మాజీ మంత్రి
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా హస్తం కండువా కప్పుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది సీనియర్ నేతలు కాంగ్రెస్లో చేరగా.. శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్మే అబ్రహం హస్తం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం బోథన్లో నిర్వహించనున్న సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
2019 లోక్సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన మండవ వెంకటేశ్వరరావు.. అప్పట్నుంచి ఆ పార్టీలోనే ఉన్నారు. అయితే పార్టీలో తగిన గుర్తింపు లేదని ఆయన గతకొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల మండవ వెంకటేశ్వరరావును టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కలిసి చర్చలు జరిపారు. కాంగ్రెస్లోకి రావాలంటూ ఆహ్వానించారు. దీంతో ఆయన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బోధన్, బాన్సువాడలో సెటిలర్లకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తారని మండవకు పేరుంది. దీంతో సెటిలర్లు కాంగ్రెస్ వైపు చూసే అవకాశముంది.
టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన మండవ వెంకటేశ్వరరావు డిచ్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1985లో తొలిసారి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1997లో చంద్రబాబు మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖమంత్రిగా పని చేశారు. 1999 ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు మంత్రివర్గంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా మూడేళ్ల పాటు పని చేసి, 2002లో విద్యాశాఖ మంత్రిగా భాద్యతలు నిర్వర్తించారు. 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న మండవ.. 2019లో గులాబీ పార్టీలో చేరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout