OTT: కేంద్రం మరో సంచలన నిర్ణయం.. 18 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌పై నిషేధం..
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అశ్లీల కంటెంట్ ఎక్కువగా ఉన్న 18 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ను నిషేధిస్తూ కేంద్ర ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కు చెందిన 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్స్, 57 సోషల్ మీడియా వేదికలను బ్లాక్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ ఓటీటీల్లో అత్యంత అసభ్యకరంగా చిత్రీకరించిన కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయని తెలిపింది. కొన్ని ఫ్లాట్‌ఫామ్స్‌లో అయితే టీచర్, స్టూడెంట్స్ మధ్య అభ్యంతరకర సన్నివేశాలున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అశ్లీల కంటెంట్‌ని వెంటనే తొలగించాలని ఆయా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేశామంది. అయితే తమ హెచ్చరికలను ఆయా ప్లాట్‌ఫామ్స్ పట్టించుకోలేదని తెలిపింది. దీంతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఆయా సంస్థలపై వేటు వేసినట్లు పేర్కొంది. ముఖ్యంగా 10 యాప్స్‌ని వెంటనే బ్లాక్ చేయాలని ఆదేశించినట్లు చెప్పింది. ఇందులో గూగుల్ ప్లే స్టోర్‌లో 7 యాప్స్, యాప్‌స్టోర్‌లో మూడు యాప్స్ ఉన్నాయంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని నిబంధనల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంచేసింది. సంబంధింత శాఖ అధికారులతో పాటు మహిళా హక్కుల నిపుణులను సంప్రదించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
కేంద్రం నిషేధించిన యాప్స్‌లో డ్రీమ్స్ ఫిల్మ్స్, వూవీ, యస్మా, అన్‌కట్ అడ్డా, ట్రై ఫ్లిక్స్, ఎక్స్ ప్రైమ్, హంటర్, ర్యాబిట్, హంటర్, ఎక్స్‌ట్రా మూడ్, న్యూఫ్లిక్స్, బేషారమ్స్, నియోన్ ఎక్స్ వీఐపీ, మూడ్ ఎక్స్, మోజ్‌ఫ్లిక్స్, హాట్ షాట్ వీఐపీ, ఫ్యూగీ, చికోఫ్లిక్స్, ప్రైమ్ ప్లే ఉన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments