Chandrababu:చంద్రబాబుకు హైకోర్టులో మరోసారి ఊరట.. ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో మరోసారి స్వల్ప ఊరట దక్కింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 18కి న్యాయస్థానం వాయిదా వేసింది. అప్పటి వరకూ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై కూడా విచారించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని సీఐడీ ఆరోపిస్తోంది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించగా.. గత బుధవారం ఉదయం విచారణ జరిగింది. ఇరు పక్షాల న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు చంద్రబాబుకు ఇవాళ్టి వరకు ముందస్తు బెయిల్ ఇస్తూ తీర్పు ఇచ్చింది. నేటితో గడువు ముగియడంతో బుధవారం వరకు ముందస్తు బెయిల్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి అసైన్డ్ భూముల కేసు నవంబర్ 1కి వాయిదా..
మరోవైపు అమరావతి అసైన్డ్ భూముల జీవోపై సీఐడీ దాఖలు చేసిన కేసులో విచారణనూ హైకోర్టు వాయిదా వేసింది. ఇప్పటికే ఈ కేసులో విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. నేడు తీర్పు రావాల్సి ఉండగా.. తమ వద్ద ఈ కేసుకు సంబంధించిన ఆడియో, వీడియో ఆధారాలు ఉన్నాయని వాటిని కోర్టులో దాఖలు చేసేందుకు అనుమతి కోరుతూ సీఐడీ అధికారలు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. వేరే కేసులో ఆధారాలు ఈ కేసులో ఎలా దాఖలు చేస్తారని న్యాయవాదులు ప్రశ్నించారు. దీంతో ఈ కేసు విచారణను నవంబర్ 1కి హైకోర్టు వాయిదా వేసింది.
క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ..
అటు సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై రేపు(మంగళవారం) మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. రేపు ఆఖరి వాదనలు వింటామన్న ధర్మాసనం తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. మరి రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వెల్లడయ్యే అవకాశం ఉందని టీడీపీ మద్దతుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments