‘అల వైకుంఠపురములో’ మరో సంచలన రికార్డ్
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో..’ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతూనే ఉంది. ఈ సినిమా కథ పాతదే అయినా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సరికొత్తగా మలిచి ప్రేక్షకులకు అందించారు. ప్రేక్షకులు సైతం బాగా ఎంజాయ్ చేశారు. ఫలితంగా ఈ సినిమా సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బారీగా కలెక్షన్స్ వసూలు చేసింది. పూజా హెగ్డే ఈ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్. ఇక తమన్ అందించి మ్యూజిక్‌కి యూత్ ఫిదా అయిపోయారు.
తాజాగా ఈ సినిమా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వెండితెరపై అదరగొ్ట్టిన ఈ చిత్రం బుల్లితెరపై కూడా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. బుల్లితెరపై రెండు వారాల క్రితం ప్రసారమైన ఈ సినిమా టీఆర్పీని రికార్డ్ స్థాయికి తీసుకెళ్లింది. 29.4 టీఆర్పీతో బుల్లితెరపై ఓ సంచలనాన్ని సృష్టించింది. ఈ రేంజ్లో టీఆర్పీ అంటే ఇది సరికొత్త రికార్డ్ అనే చెప్పాలి. ఏది ఏమైనా అల్లు అర్జున్ నటన, డ్యాన్స్, తమన్ మ్యూజిక్, త్రివిక్రమ్ దర్శకత్వం అన్నీ ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయి.
ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్ మాత్రం విడుదలైన నాటి నుంచి పూటకో రికార్డు చొప్పున తన ఖాతాలో వేసుకుంటూనే వస్తోంది. ఈ చిత్రలో బుట్టబొమ్మ సాంగ్ 333 మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పాపులర్ అయిన 100 వీడియో సాంగ్స్‌లో బుట్టబొమ్మ 15వ స్థానంలో నిలిచింది. మిగిలిన పాటలు ఈ స్థాయిలో కాకపోయిన ఇవి కూడా అద్భుతమైన వ్యూస్‌ను రాబట్టాయి. ఈ సినిమాలోని రాములో రాములా అనే పాట, సామజవరగమన అనే పాట కూడా 180 మిలియన్ వ్యూస్ రాబట్టడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments