‘అల వైకుంఠపురములో’ మరో సంచలన రికార్డ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో..’ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతూనే ఉంది. ఈ సినిమా కథ పాతదే అయినా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సరికొత్తగా మలిచి ప్రేక్షకులకు అందించారు. ప్రేక్షకులు సైతం బాగా ఎంజాయ్ చేశారు. ఫలితంగా ఈ సినిమా సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బారీగా కలెక్షన్స్ వసూలు చేసింది. పూజా హెగ్డే ఈ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్. ఇక తమన్ అందించి మ్యూజిక్‌కి యూత్ ఫిదా అయిపోయారు.

తాజాగా ఈ సినిమా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వెండితెరపై అదరగొ్ట్టిన ఈ చిత్రం బుల్లితెరపై కూడా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. బుల్లితెరపై రెండు వారాల క్రితం ప్రసారమైన ఈ సినిమా టీఆర్పీని రికార్డ్ స్థాయికి తీసుకెళ్లింది. 29.4 టీఆర్పీతో బుల్లితెరపై ఓ సంచలనాన్ని సృష్టించింది. ఈ రేంజ్‌లో టీఆర్పీ అంటే ఇది సరికొత్త రికార్డ్ అనే చెప్పాలి. ఏది ఏమైనా అల్లు అర్జున్ నటన, డ్యాన్స్, తమన్ మ్యూజిక్, త్రివిక్రమ్ దర్శకత్వం అన్నీ ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయి.

ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్ మాత్రం విడుదలైన నాటి నుంచి పూటకో రికార్డు చొప్పున తన ఖాతాలో వేసుకుంటూనే వస్తోంది. ఈ చిత్రలో బుట్టబొమ్మ సాంగ్ 333 మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పాపులర్ అయిన 100 వీడియో సాంగ్స్‌లో బుట్టబొమ్మ 15వ స్థానంలో నిలిచింది. మిగిలిన పాటలు ఈ స్థాయిలో కాకపోయిన ఇవి కూడా అద్భుతమైన వ్యూస్‌ను రాబట్టాయి. ఈ సినిమాలోని రాములో రాములా అనే పాట, సామజవరగమన అనే పాట కూడా 180 మిలియన్ వ్యూస్ రాబట్టడం విశేషం.

More News

మీడియాపై రియా చక్రవర్తి ఫైర్.. కొద్ది నిమిషాలకే పోస్ట్ డిలీట్..

మీడియాపై బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తి తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది.

రియా చాలా రోజుల పాటు నా కుమారుడికి విషమిచ్చింది: సుశాంత్ తండ్రి

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.

గుడ్ న్యూస్ చెప్పిన విరుష్క..

టీమ్ ఇండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం గుడ్ న్యూస్ చెప్పాడు.

పవన్‌కి కేంద్ర మంత్రి పదవి.. పార్టీ పరిస్థితేంటో..!?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్‌పై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది.

తెలంగాణలో కొత్తగా 2795 కేసులు..

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. మరోవైపు తెలంగాణలో పరీక్షల సంఖ్యను సైతం పెంచారు.