‘బుట్టబొమ్మ..’ మరో రికార్డ్
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమా వసూళ్ల పరంగా నాన్ బాహుబలి రికార్డులను సాధించింది. సినిమా జనవరిలో విడుదలైనప్పటికీ ఏదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా ఈ సినిమా పాటలు. తమన్ అందించిన సంగీతం మరో లెవల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా మూడు పాటలు సామజవరగమన..., రాములో రాముల..., బుట్టబొమ్మ లిరికల్ సాంగ్స్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా విడుదలైన విడుదలైన వీడియో సాంగ్స్‌కు లిరికల్ వీడియోలను మించిన రెస్పాన్స్ వచ్చింది. ఒక్కొక్క వీడియోకు 100 మిలియన్ వ్యూస్ దాటేశాయి. టాప్ 100 గ్లోబల్ సాంగ్స్‌లో బుట్టబొమ్మ.., రాములో రాముల.., సాంగ్స్ స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఈ పాటలు వాటికవే పోటీ పడుతుండటం విశేషం.
ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్‌లో బన్నీ స్టెప్పులను చూసిన సెలబ్రిటీలందరూ డాన్సులు చేస్తూ ఆ వీడియోలను టిక్‌టాక్‌లో పోస్ట్ చే్శారు. శిల్పాశెట్టి, దిశా పటాని, వార్నర్ ఇలా అందరూ ఈ పాటకు ఫిదా అయ్యారు. ఈ సాంగ్ లేటెస్ట్గా మరో రికార్డ్‌ను సొంతం చేసుకుంది. 200 మిలియన్ మార్కును ఈ పాట చేరుకోవడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments