హైదరాబాద్‌లో మరో పోలీస్‌కు కరోనా.. ఎలా వచ్చింది!?
Send us your feedback to audioarticles@vaarta.com
రోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ విస్తరిస్తోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో జనాలను బయటికి రానివ్వకుండా.. కరోనాపై పోరుల చేస్తున్న వైద్యులు, పోలీసులను సైతం ఈ మహమ్మారి కాటేస్తోంది.!. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలువురు వైద్యులు, పోలీస్ సిబ్బంది కరోనా బారినపడగా.. తాజాగా హైదరాబాద్‌లో ఇద్దరు పోలీస్ సిబ్బందికి వైరస్ సోకింది. తాజాగా.. నగరంలోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆయనకు కరోనా ఎలా వచ్చిందని ఆరా తీయగా.. తనిఖీల్లో భాగంగానే సదరు కానిస్టేబుల్ వైరస్ బారినపడినట్టు అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం మాత్రం తెలియరాలేదు. కాగా.. నగరంలోని తుర్కయాంజల్ మున్సిపాలిటీ మునగనూరు కానిస్టేబుల్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. విధులు నిర్వహించే ఖాకీలకు కరోనా రావడంతో కలవరానికి గురి చేస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments