హైదరాబాద్‌లో మరో పోలీస్‌కు కరోనా.. ఎలా వచ్చింది!?

రోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ విస్తరిస్తోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో జనాలను బయటికి రానివ్వకుండా.. కరోనాపై పోరుల చేస్తున్న వైద్యులు, పోలీసులను సైతం ఈ మహమ్మారి కాటేస్తోంది.!. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలువురు వైద్యులు, పోలీస్‌ సిబ్బంది కరోనా బారినపడగా.. తాజాగా హైదరాబాద్‌లో ఇద్దరు పోలీస్‌ సిబ్బందికి వైరస్‌ సోకింది. తాజాగా.. నగరంలోని చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వ్యక్తికి కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. దీంతో అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆయనకు కరోనా ఎలా వచ్చిందని ఆరా తీయగా.. తనిఖీల్లో భాగంగానే సదరు కానిస్టేబుల్‌ వైరస్‌ బారినపడినట్టు అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం మాత్రం తెలియరాలేదు. కాగా.. నగరంలోని తుర్కయాంజల్‌ మున్సిపాలిటీ మునగనూరు కానిస్టేబుల్‌కు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. విధులు నిర్వహించే ఖాకీలకు కరోనా రావడంతో కలవరానికి గురి చేస్తోంది.

More News

ఉద్యోగులను తొలగించొద్దు..: కంపెనీలకు కేటీఆర్ విజ్ఙప్తి

ఎట్టి పరిస్థితుల్లోనూ కంపెనీల్లోని ఉద్యోగులను తొలగించవద్దని పరిశ్రమ వర్గాలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పారిశ్రామిక వర్గాలకు ప్రత్యేకంగా కేటీఆర్ ప్రత్యేకంగా లేఖ

నూజివీడులో ఇంటింటికీ సరుకులు పంచిన వ్యక్తికి కరోనా

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఊహించని రీతిలో కేసులు పెరిగిపోతున్నాయి. తగ్గినట్లే తగ్గి ఒక్కసారిగా కేసులు సంఖ్య

మహేశ్ స‌ర‌స‌న 'సాహో' బ్యూటీ

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ సినిమాకు సంబంధించిన కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభం కావాల్సిన

ఎన్టీఆర్ బ‌ర్త్ డే ట్రీట్ డౌటే!!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో న‌టిస్తోన్న చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్

జ‌క్క‌న్న‌తో మ‌హేశ్ ఫిక్స్‌..?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ అభిమానుల‌ను చాలా రోజులుగా వేధిస్తోన్న ప్ర‌శ్న‌.. త‌మ అభిమాన హీరోతో ఆల్ ఇండియా డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి సినిమా ఎప్పుడు చేస్తాడు? అని. బాహుబ‌లి స‌మ‌యంలో