దేవిశ్రీ ఖాతాలో మరొకరు..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం టాలీవుడ్‌లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్నారు యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్. కేవలం నెల రోజుల గ్యాప్‌లో రంగస్థలం, భరత్ అనే నేను చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్‌లను తన ఖాతాలో వేసుకుని తన స్టామినా ఏంటో చెప్పకనే చెప్పారు దేవిశ్రీ . టాలీవుడ్‌లోని రెండు జనరేషన్‌ల అగ్ర హీరోలందరితోనూ పనిచేసిన దేవిశ్రీ.. వారందరి కాంబినేషన్‌లోనూ విజయాలు అందుకున్నారు. అందుకే.. టాప్ హీరోలందరూ దేవిశ్రీతో మళ్ళీ మళ్ళీ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు హీరోలైతే వరుసగా మూడు సినిమాలు చేసిన సందర్భాలున్నాయి.
ఆ మధ్య అల్లు అర్జున్ కాంబినేషన్‌లో జులాయి, ఇద్దరమ్మాయిలతో, ఎవడు (గెస్ట్ రోల్).. ఇలా మూడు సినిమాల కోసం పనిచేశారు దేవిశ్రీ . అలాగే ఎన్టీఆర్‌తో.. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ చేసి హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పుడే ఇదే వరుసలో మరో హీరోతో వరుసగా మూడు సినిమాలు చేయబోతున్నారు. ఆ హీరో మరెవరో కాదు.. మహేష్ బాబు. ఇటీవలే విడుదలైన భరత్ అనే నేనుతో మొదలుపెట్టి మహేష్ 25వ చిత్రం (వంశీ పైడిపల్లి దర్శకుడు), మహేష్ 26వ చిత్రం (సుకుమార్ దర్శకుడు) వరకు వరుసగా దేవిశ్రీనే సంగీత దర్శకుడిగా వ్యవహరించనుండడం వార్తల్లో నిలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com