బన్నీ ఖాతాలో మరొకటి
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు చెబితే గుర్తుకొచ్చే చిత్రం ఆర్య`. అందులో వన్ సైడ్ లవర్ గా బన్నీ నటన అద్భుతమనే చెప్పాలి. వేసవిని టార్గెట్ చేస్తూ మే మొదటి వారంలో విడుదలైన ఈ చిత్రం బన్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక నాలుగు సంవత్సరాల గ్యాప్ తర్వాత అదే మే మొదటి వారంలో పరుగు` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు బన్నీ. ఈ సినిమాలో పాటలన్ని శ్రోతలను అలరించి... అప్పట్లో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది.
కట్ చేస్తే.. ప్రస్తుతం బన్నీ నటిస్తున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` కూడా మే మొదటి వారాన్ని టార్గెట్ చేస్తూ.. మే 4న విడుదల కానుంది. మే మొదటి వారంలో విడుదలైన బన్ని చిత్రాలన్నీ మంచి విజయం సాధించడంతో.. ఈ చిత్రం కూడా ఘన విజయం సాధించి అల్లు అర్జున్ కెరీర్లో మరపురాని చిత్రంగా నిలుస్తుందన్న ఆశాభవంతో ఉన్నారు అభిమానులు. గత చిత్రాల్లో లవర్ బాయ్‌గా నటించిన బన్నీ ఈ సినిమాలో సైనికుడి పాత్రలో సందడి చేయనున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com