మరో అవకాశం దక్కించుకున్న కుమారి హీరోయిన్..

  • IndiaGlitz, [Tuesday,December 08 2015]

సుకుమార్ తొలి ప్ర‌య‌త్నంగా నిర్మించిన కుమారి 21 ఎఫ్ మూవీలో న‌టించిన హేబా ప‌టేల్ త‌న న‌ట‌న‌తో యూత్ ను బాగా ఆక‌ట్టుకుంది. తొలి ప్ర‌య‌త్నంలోనే ఘ‌న విజ‌యం సాధించడంతో వ‌రుస‌గా అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటుంది. మంచు విష్ణు, రాజ్ త‌రుణ్ కాంబినేష‌న్ లో రూపొందే మూవీలో రాజ్ త‌రుణ్ స‌ర‌స‌న హీరోయిన్ గా మ‌ళ్లీ హేబా ప‌టేల్ జ‌త‌క‌ట్ట‌నుంది. త్వ‌ర‌లోనే ఈ మూవీని ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే...హేబా ప‌టేల్ నిఖిల్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంది. నిఖిల్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో నిఖిల్ స‌ర‌స‌న ముగ్గురు హీరోయిన్స్ న‌టిస్తున్నారు. తాప్సీ, అవికా గోర్, స్వాతి ని ఫిక్స్ చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం అవికాగోర్, హేబా ప‌టేల్ ను ఫిక్స్ చేసార‌ట‌. కేథ‌రిన్ ను మూడో క‌థానాయిక‌గా ఎంపిక చేస్తున్నార‌ట‌.....